అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. జగన్ జగమెుండి అంటూ ఘాటుగా విమర్శించారు. 

విద్యుత్ ఒప్పందాల పునఃసమీక్ష మంచిది కాదని, రాష్ట్రానికి పెట్టుబడులు దూరమవుతాయని నాడు కేంద్రం చెప్పినా జగన్ పట్టించుకోలేదని చంద్రబాబు గుర్తు చేశారు. స్వయంగా కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి చెప్పినా జగన్ వినలేదని తెలిపారు. 

బుధవారం జపాన్ రాయబార కార్యాలయం కూడా జగన్ పై విమర్శలు చేసిందని గుర్తు చేశారు. ఆ మనిషి తలకెక్కేలా కాస్త చెప్పమని భారత్ కు లేఖ రాసిన వైనంపై మండిపడ్డారు. జగమొండి అనే పదంలో సగం ఆయన పేరులో ఉంటే, మిగిలిన సగం ఆయన చేసే పనుల్లో ఉందంటూ విమర్శించారు. 

రాష్ట్రందాటి, దేశందాటి, జగమంతా వారికి క్లాస్ లు పీకుతున్నారని బహుశా ఇలా చెప్పించుకోవడం వైసీపీ వాళ్లకు గర్వకారణంగా ఉందో ఏమో అంటూ సెటైర్లు వేశారు. పిచ్చికి అనేక రూపాలు మరి అంటూ చంద్రబాబు సీఎం జగన్ పై విమర్శలు చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

వైఎస్ జగన్ కు జపాన్ కరెంట్ షాక్