అమరావతి: ఉండవల్లిలోని తన నివాసంపై ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడా ఇళ్లు నిర్మించలేదని, భూములు తీసుకోలేదని స్పష్టం చేశారు. తాను నివసించడానికి అద్దెకు తీసుకున్నానని స్పష్టం చేశారు. లింగమనేని రమేష్ అనే వ్యక్తి దగ్గర ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు.

అసెంబ్లీలో కరకట్టపై అక్రమ కట్టడాల గురించి, ప్రజావేదిక కూల్చివేతపై చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షతోనే ప్రజావేదికను కూల్చివేశారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 

ఇకపోతే ప్రజావేదిక తన భవనం కాదని, ప్రభుత్వ భవవనమని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ప్రజావేదిక తనకు కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశానని వెంటనే దానిని కూల్చివేశారని అది రాజకీయ కక్ష కాదా అని నిలదీశారు చంద్రబాబు. 

తాను బెదిరింపులకు భయపడనని చెప్పుకొచ్చారు. తాను ఉంటున్న నివాసం నదికి 130 మీటర్ల దూరంలో ఉందని గుర్తు చేశారు. దాన్ని కూడా అక్రమమేనని అంటున్నారని చెప్పుకొచ్చారు. తాను నివాసం మాత్రమే ఉంటున్నానని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో అనేక అక్రమ కట్టడాలు ఉన్నాయని వాటి పరిస్థితి ఏంటని చంద్రబాబు నిలదీశారు. వాటిని కూడా కూల్చుతారా అంటూ ప్రశ్నించారు. ప్రజావేదిక కూల్చివేతపై ప్రజలు భయాందోళన చెందుతున్నారని భవిష్యత్ లో ఏం జరుగుతోందని ఆందోళన చెందుతున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 

ఈ వార్తలు కూడా చదవండి

సీఎం కదా ఏదైనా చెల్లుతుందనుకున్నారు, మీకో రూల్, సామాన్యుడికి ఒకరూలా: చంద్రబాబుపై జగన్ ధ్వజం