చంద్రబాబు సభపై రాళ్ల దాడి: ఈసీకి టీడీపీ ఫిర్యాదు

చంద్రబాబు సభలో రాళ్ల దాడిపై టీడీపీ ఎంపీలు ఈసీకి మంగళవారంనాడు ఫిర్యాదు చేశారు.

TDP MPs complain to EC against YSRCP lns


న్యూఢిల్లీ: చంద్రబాబు సభలో రాళ్ల దాడిపై టీడీపీ ఎంపీలు ఈసీకి మంగళవారంనాడు ఫిర్యాదు చేశారు.ఇవాళ టీడీపీ ఎంపీలు  గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ లు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తిరుపతి ఉప ఎన్నికలకు కేంద్ర బలగాలను వినియోగించాలని కోరారు. 

also read:మందుపాతరకే భయపడలేదు, రాళ్లకు భయపడుతానా?: చంద్రబాబు

పోలింగ్ కేంద్రాల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. 2 లక్షల నకిలీ ఓటర్లు నమోదయ్యాయరన్నారు. రెండు అదనపు గుర్తింపు కార్డులు ఉంటేనే ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని ఎంపీలు ఆ వినతిపత్రంలో కోరారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంలోని వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యుల్ని చేయవద్దని కోరారు. 

ఈ నెల 12వ తేదీన తిరుపతిలో చంద్రబాబునాయుడు నిర్వహించిన రోడ్ షో లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరికి గాయాలైనట్టుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడిని నిరసిస్తూ చంద్రబాబునాయుడు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios