కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఎలా జరిగిందంటే...: టిడిపి ఎంపీ, వైసిపి ఎమ్మెల్యే మాటల్లోనే (వీడియో)
రెండు రోజులుగా వాయిదాపడుతూ వస్తున్న కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిన హైకోర్టు ఆదేశాలతో బుధవారం సజావుగా ముగిసింది. ఈ ప్రక్రియ ఎలా సాగిందో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మీడియాకు వివరించారు.
కొండపల్లి: గత రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్తత మధ్య వాయిదాపడుతూ వస్తున్న కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఆ ఫలితాన్ని అధికారులు ప్రకటించలేదు. దీంతో కొండపల్లి మున్సిపాలిటీ పాలకవర్గంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.
అయితే ఇవాళ(బుధవారం) kondapalli municipality chairman, vice chairman ఎన్నిక ఎలా సాగిందో టిడిపి ఎంపీ కేశినేని నాని వివరించారు. మున్సిపల్ కార్యాలయం చుట్టూ భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నిక ప్రక్రియ ముగిసిందన్నారు.TDP తరపున చైర్మన్ గా చెన్నుబోయిన చిట్టిబాబును, వైస్ చైర్మన్ - 1 గా ధరణికోట శ్రీలక్ష్మి, వైస్ చైర్మన్ - 2 గా శ్రీనివాస్ చుట్టుకుదురును ప్రతిపాదించినట్లు MP Kesineni Nani వెల్లడించారు.
''అధికారం అండతో వైసిపి నాయకులు మా కౌన్సిలర్లను ఎంతో ప్రలోభపెట్టారు. కానీ 15మంది టిడిపి కౌన్సిలర్లలో ఏ ఒక్కరు వారి ప్రలోభాలకు లొంగలేదు. డబ్బులు, పదవుల హామీలకు లొంగిపోయి ఎన్నిక నుండి తప్పుకోకుండా టిడిపి పక్షానే నిలబడ్డారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో టీడీపీకి ఇలాంటి వారు కౌన్సిలర్లుగా ఉండటం ప్రశంసనీయం'' అని ఎంపీ కొనియాడారు.
వీడియో
''ఇక కొండపల్లి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికపై తుది నిర్ణయం హైకోర్టుదే. నా ఓటును కూడా కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు నిర్ణయం ఏదయినా గౌరవిస్తాం. అయితే తాము ప్రతిపాధించిన సభ్యులే కొండపల్లి ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఎన్నికవుతారని ధీమాతో వున్నాం'' అని కేశినేని నాని అన్నారు.
ఇక కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైసక్ ఛైర్మన్ ఎన్నిక తర్వాత వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా మీడియాతో మాట్లాడారు. తాముమున్సిపల్ కార్యాలయంలోకి వెళ్ళేటప్పుడు ఏం చెప్పామో లోపల అదే జరిగిందన్నారు YCP MLA Vasantha Krishna Prasad. 16వ ఓటు చెల్లదని కోర్టుకు వెళ్ళామని... న్యాయస్థానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. కోర్టు తీర్పును గౌరవిస్తామని... నిర్ణయం ఏదయినా సరే కట్టుబడి ఉంటామన్నారు.
రెండున్నర సంవత్సరాలలో 40కోట్లతో కొండపల్లి పరిసర ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఏ పాలకవర్గం ఎన్నికయినా తన వంతుగా కొండపల్లి అభివృద్దికి ఖచ్చితంగా సహకరిస్తానని అన్నారు. ఎన్నిక ప్రక్రియలో ప్రజాస్వామ్యబద్దంగా ఎవరు గెలిచినా ప్రభుత్వపరంగా సహకరిస్తామని కృష్ణప్రసాద్ అన్నారు.
వీడియో
ఇటీవల కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ మున్సిపాలిటీ ఓటర్లు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వలేదు. మొత్తం 29 వార్డులకు గాను టీడీపీ తరపున 15 మంది, వైసీపీ తరపున 14 మంది కౌన్సిలర్లు గెలుపొందారు. దీంతో పాలకవర్గం ఏర్పాటుపై గందరగోళం నెలకొంది.
read more Kondapalli municipality: ముగిసిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక.. ఆ తర్వాతే తేలనున్న విజేత..
అయితే చైర్మన్ ఎన్నిక సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకున్నారు. ఎక్స్ అఫిషియో ఓట్ల అనంతరం టీడీపీ బలం 16కి, వైసీపీ బలం 15కి పెరిగింది. దీంతో కొండపల్లి ఛైర్మన్ పీఠం టిడిపికి దక్కే అవకాశాలున్నాయి. అయితే కేశినేని నాటి ఓటుపై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. దీంతో కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎవరన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.