Asianet News TeluguAsianet News Telugu

kondapalli municipality: 144సెక్షన్, భవనాలపైనుండి పోలీస్ పహారా... కొండపల్లి ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ (వీడియో)

కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక గందగోళం మధ్య గత రెండురోజులుగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఇవాళ ఎన్నిక జరగనుంది. 

SEC conducting Kondapalli municipal chairperson election in heavy police protection
Author
Kondapalli, First Published Nov 24, 2021, 10:50 AM IST

కొండపల్లి: కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ గత రెండురోజులుగా వాయిదాపడుతూ వస్తున్న విషయం తెలిసిందే.  విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియోగా  ఓటు హక్కు వినియోగించుకొవడాన్ని వైసిపి అభ్యంతరం చెబుతోంది. అయితే కేశినేని ఓటు ఛైర్మన్ ఎన్నికలో కీలకం కావడంతో టిడిపి కూడా ఎట్టిపరిస్థితుల్లో ఆయనతో ఓటు వేయించి ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే గత రెండురోజులుగా కొండపల్లిలో ఉద్రిక్తత నెలకొంది.  

అయితే హైకోర్టు ఆదేశాల మేరకు konapalli municipality chairman election ఇవాళ (బుధవారం) జరగనుంది. తన ఓటుపై వైసిపి వివాదం చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని AP High Court ను ఆశ్రయించగా మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పోలీసు ప్రొటెక్షన్ తో చైర్మన్ ఎన్నిక జరిపించాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అయితే ఫలితాలను మాత్రం ప్రకటించొద్దని హైకోర్టు స్పష్టం చేసింది.

read more  kondapalli municipality : హాజరు కోరగానే.. బల్లలు విరగ్గొట్టారు, అధికారులూ వైసీపీ పక్షమే: కేశినేని ఆగ్రహం

హైకోర్టు ఆదేశాలతో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కొండపల్లిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు. కొండపల్లి మునిసిపాలిటీ పరిధిలో నేడు 144 సెక్షన్ అమల్లో ఉంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో కొండపల్లి పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఏర్పాట్లను, పోలీస్ బందోబస్తును పరిశీలించారు సీపీ బత్తిన శ్రీనివాసులు. మున్సిపల్ కార్యాలయం వద్దే కాకుండా వివిధ ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసారు. భవనాల పైనుండి కూడా పోలీస్ పహారా కొనసాగుతోంది.

ఇక  ఇప్పటికే కొండపల్లి మున్సిపాలిటి  కార్యాలయానికి విజయవాడ ఎంపీతో కేశినేని నానితో పాటు 15 మంది తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు చేరుకున్నారు. అలాగే వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో పాటు 14మంది వైసిపి కౌన్సిలర్లు కూడా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. 

read more  Kondapalli municipality: కొండపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ ఎన్నిక వాయిదాపై ఏపీ హైకోర్టు ఆగ్రహం..

ఇటీవల కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ మున్సిపాలిటీ ఓటర్లు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వలేదు. మొత్తం 29 వార్డులకు గాను టీడీపీ తరపున 15 మంది, వైసీపీ తరపున 14 మంది కౌన్సిలర్లు గెలుపొందారు. దీంతో పాలకవర్గం ఏర్పాటుపై గందరగోళం నెలకొంది. 

అయితే చైర్మన్ ఎన్నిక సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకోనున్నారు. ఎక్స్ అఫిషియో ఓట్ల అనంతరం టీడీపీ బలం 16కి, వైసీపీ బలం 15కి పెరగనుంది. ఇదే జరిగితే కొండపల్లి ఛైర్మన్ పీఠం టిడిపి దక్కుతుంది. దీంతో కేశినాని నాని ఎక్స్ అఫిషియో ఓటు వేయకుండా వైసిపి అడ్డుపడుతోంది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించిన ఆయన ఓటేసే అవకాశం కల్పించాలని కోరారు. ఆయన వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం పోలీస్ బందోబస్తు మధ్య ఛైర్మన్ ఎన్నిక జరపాలని ఆదేశించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios