మీడియా సమావేశాల్లో మాట్లాడే ముందు రోజాకు ఆల్కహాల్ పరీక్షలు చేయించాలని వెంకన్న సూచించారు. ప్రతిపక్ష పార్టీ పెద్ద డ్రామా కంపెనీలాగ తయారైందని మండిపడ్డారు. భూమా అఖిలప్రియపై వ్యక్తి గత విమర్శలు చేస్తోందంటూ ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు నైతికవిలువలు మరిచి మాట్లాడుతున్నారన్నారు.
నంద్యాల ఉపఎన్నిక దగ్గర పడే కొద్దీ ప్రధాన పార్టీ నేతల మాటాలు హద్దులు దాటుతున్నాయి. టిడిపి, వైసీపీ నేతల్లో అందరూ అనికాదు కానీ చాలా మంది అదే విధంగా మాట్లాడుతున్నారు. కొందరైతే రాయటానికి కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్న నంద్యాల బహిరంగ సభలో జగన్ ముఖ్యమంత్రిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యాలతో ఇరు పార్టీల నేతల మధ్య మాటల వార్ బాగా జోరందుకున్నది. అదే జోరును వైసీపీలో రోజా, కరుణాకర్ రెడ్డి తదితరులు కొనసాగిస్తున్నారు. ఇక, టిడిపిలో పలువురు మంత్రులకు తోడు తాజాగా ఎంఎల్సీ బుద్దా వెంకన్న కూడా తోడయ్యారు.
అసలు విషయానికి వస్తే, మీడియా సమావేశాల్లో మాట్లాడే ముందు రోజాకు ఆల్కహాల్ పరీక్షలు చేయించాలని వెంకన్న సూచించారు. ప్రతిపక్ష పార్టీ పెద్ద డ్రామా కంపెనీలాగ తయారైందని మండిపడ్డారు. భూమా అఖిలప్రియపై వ్యక్తి గత విమర్శలు చేస్తోందంటూ ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు నైతికవిలువలు మరిచి మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆడా, మగ తేడా లేకుండా వ్యక్తిగత విమర్మలకు దిగుతున్నారన మండిపడ్డారు.
తల్లి, తండ్రిని పోగొట్టుకుని దుఖంలో ఉన్న భూమా అఖిలప్రియ వస్త్రధారణపై విమర్శలు చేస్తున్న ఆమె తన సినిమాలు, పోగ్రాంలలో ఎలాంటి దుస్తులు వేస్తారో ప్రజలకు తెలియవా అంటూ నిలదీసారు. చెల్లని చెక్కుల కేసులో కోర్టుల చుట్టూ తిరిగే రోజాకు అఖిలప్రియను విమర్శించేస్థాయి లేదన్నారు. రాష్ట్రంలో పిడుగు ఎప్పుడు ఎక్కడ పడుతుందో తెలుసుకునే టెక్నాలజీని తీసుకొస్తున్న ప్రభుత్వానికి వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అండ్‌కోకు బుద్ధి జ్ఞానం ఎలా తీసుకురావాలో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. టిడిపిపై విమర్శలు చేస్తున్న వారు తనతో ముఖాముఖి చర్చకు రావాలని కూడా సవాల్ విసిరారండోయ్.
