విజయవాడ: ముదినేపల్లిలో దళితులపై దాడి చేసిన వారిని తప్పించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని టిడిపి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోపించారు. నిందితులను శనివారం సాయంత్రంలోపు అరెస్టు చేయ్యాలని...నిందితులను అరెస్టు చేయకుంటే చలో ఐనంపూడికి పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. 

ఈ ఘటనపై కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ, జిల్లా సమన్వయ సమావేశాన్ని నిర్వహించినట్లు... ఇందులో జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కైకలూరు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారని తెలిపారు. దళిత వర్గానికి చెందిన కుటుంబంపై దాడి చేసి ఇంటిని తగలబెట్టి, కుటుంబ సభ్యుల సజీవ దహనానికి కుట్ర చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలుని డిమాండ్ చేయాలని నిర్ణయించినట్లు అర్జునుడు పేర్కొన్నారు. 

read more  దళిత యువతి ఇంటికి నిప్పు...నిందితుడు సాయిరెడ్డికి వైసిపి అండ: అనురాధ

అయితే నిందితులను అరెస్టు చేయకుండా పోలీసులు రాజీకి ప్రయత్నించడంతో పాటు బాధితులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని...ఇందులో వైసీపీ ప్రభుత్వ కుట్ర దాగి ఉందన్నారు. అందువల్లే రేపు(శనివారం) జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దళిత సంఘాలు, రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలతో సమావేశమై ఈ అంశం చర్చిస్తామన్నారు. అదేరోజు సాయంత్రం లోపు నిందితులను అరెస్టు చేయకుంటే చలో ఐనంపూడి కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్సీ అర్జునుడు హెచ్చరించారు.