Asianet News TeluguAsianet News Telugu

దళిత యువతి ఇంటికి నిప్పు...నిందితుడు సాయిరెడ్డికి వైసిపి అండ: అనురాధ

 పెళ్లి చేసుకోమని అన్నందుకు కక్ష కట్టి అర్ధరాత్రి యువతి ఇంటికి నిప్పంటించిన నిందితుడికి వైసిపి అండగా నిలుస్తోందని పంచుమర్తి అనురాధ ఆరోపించారు. 

panchumarthi anuradha serious on woman security in AP
Author
Vijayawada, First Published Sep 3, 2020, 7:35 PM IST

విజయవాడ: జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. కృష్ణా జిల్లాలో దళిత యువతి ఇంటికి నిప్పంటించి ఘటన అత్యంత బాధాకరమని...వైసీపీ నేతల అండతోనే నేరస్తులు రెచ్చిపోతున్నారన్నారు. 

''కృష్ణా జిల్లాలో నర్సింగ్ యువతిని ప్రేమ పేరుతో సాయిరెడ్డి అనే యువకుడు వేధించాడు. చివరకు పెళ్లి చేసుకోమని అన్నందుకు కక్ష కట్టి అర్ధరాత్రి యువతి ఇంటిపై నిప్పంటించాడు. ఈ ఘటనలో రాజీ కుదిర్చేందుకు సాయిరెడ్డి తరపున వైసీపీ నాయకులు ప్రయత్నించారు. మహిళలకు న్యాయం జరగకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారు'' అని ఆరోపించారు. 

''యువతి కుటుంబానికి హాని జరిగిఉంటే బాధ్యత ఎవరు తీసుకుంటారు? దిశా చట్టం తీసుకొస్తామని ముఖ్యమంత్రి సహా నేతలంతా ఊదరగొట్టారు. 13 జిల్లాల్లోనూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతామన్నారు. 13 మంది పబ్లిక్  ప్రాసిక్యూటర్ లను నియమిస్తామన్నారు. ప్రతి జిల్లాలోనూ ఫోరెన్సిక్ ల్యాబ్ లు పెట్టి 176 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. దిశా ఇంతవరకూ చట్టరూపం దాల్చలేదు. రాష్ట్రపతి ఆమోదం పొందలేదు. ఆమోదం కోసం వైసీపీ ఎంపీలు కనీసం రిప్రజెంటేషన్ ఇవ్వలేదు'' అని గుర్తుచేశారు.

READ MORE  టిడిపి హయాంలో పనులపై ఆడిట్... కాగ్ ను ఆశ్రయించాలన్న హైకోర్టు 

''గతంలో చంద్రబాబు నిర్మించిన పోలీస్ట్ స్టేషన్ భవనాలకు దిశా పోలీస్ స్టేషన్లుగా నామకరణం మాత్రం చేసేశారు. చట్టం కాని దిశాతో ఉద్దరిస్తామని చెప్పడమేంటి? 13 జిల్లాల్లోనూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్మించాలంటే హైకోర్టు అనుమతి తప్పనిసరి. ఆ దిశగా ఈ ప్రభుత్వం ఏం పేపర్ వర్క్ చేసింది? హోంమంత్రి సమాధానం చెప్పాలి'' అని అనురాధ డిమాండ్ చేశారు. 

''మద్యపానం గురించి మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిపై అసభ్యకర పోస్టులు పెట్టారు. పోస్టులపై ఫిర్యాదు చేస్తే ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. నాపై ట్రోల్ చేసిన వారిపై ఫిర్యాదు చేస్తే ఇంతవరకూ చర్యలు లేవు. దళిత మహిళను నిర్బంధించి నాలుగు రోజులు అత్యాచారం చేసి చివరకు పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేస్తే ఆ కేసు విషమంలో నేటీకీ అతీగతీ లేదు. గుంటూరులో బీటెక్ విద్యార్థిని నగ్న చిత్రాలు తీసిన వ్యక్తిపై ఏం చర్యలు తీసుకున్నారు? అనంతపురంలో ఓ వాలంటీర్ యువతిని మోసం చేశాడు. పెళ్లి చేసుకోమన్నందుకు యువతి కుటుంబంపై దాడి చేసినా అతడిపై కేసు నమోదు చేయలేదు'' అని అన్నారు. 

''అయితే ఇన్ని దారుణాలు జరుగుతున్నా సమాధానం చెప్పని ఈ ప్రభుత్వం చంద్రబాబుకు మాత్రం నోటీసులు ఇవ్వడమేంటి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి నోటీసులిస్తారా?  వైసీపీ పాలనలో చట్టాలు చట్టుబండలయ్యాయి'' అని మండిపడ్డారు. 

''బడుగు, బలహీన వర్గాల మహిళలకు రక్షణ లేదు. పోలీసులు కూడా పాలకులకు వత్తాసు పలుకుతున్నారు. 230కి పైగా ఉన్న కేసులను ఎప్పుడు పరిష్కరిస్తారు? వైసీపీ నేతల మాటలకు చేతలకు పొంతన లేదు'' అని విమర్శించారు. 

''ప్రభుత్వమే చట్టవ్యతిరేకంగా వ్యవహరించడం మునుపెన్నడూ చూడలేదు. దిశా కింద కేసు నమోదైతే ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామని చెప్పారు. ఆచరణలో పెట్టారా? టీడీపీ హయాంలో మహిళా రక్షణకు తీసుకున్న చర్యలను వైసీపీ ప్రభుత్వం కొనసాగించాలి. నాడు దాచేపల్లిలో చిన్నారిని అత్యాచారం చేసిన వ్యక్తిని ఉరి తీయాల్సిందేనని చంద్రబాబు హెచ్చరించడంతో అతడు భయంతో ఉరేసుకుని చనిపోయాడు. తప్పు చేస్తే ప్రభుత్వం శిక్షిస్తుందనే భయం నేరస్థులకు ఉండాలి. ఏ తప్పు చేసినా వైసీపీ నేతలు కాపాడుతారనే ధీమాలో నేరస్థులు ఉండటం బాధాకరం'' అని అనురాధ మండిపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios