టిడిపి-బిజెపి మధ్య మాటల యుద్దం పెరుగుతోంది మళ్ళీ. ఆదివారం నాటి చంద్రబాబునాయుడు సమావేశం తర్వాత మాటల యుద్ధం మరింత పెరుగుతోంది. టిడిపి ఎంఎల్సీ బుద్దా వెంకన్న చేసిన కామెంట్లే అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. సోమవారం వెంకన్న సోము వీర్రాజుపై ఫైర్ అయ్యారు. వీర్రాజు ఎవరి డైరెక్షన్ లో పని చేస్తున్నాడో ముందు తేల్చిచెప్పాలని డిమాండ్ చేసారు.

వీర్రాజు  వైసీపీ నేతల డైరెక్షన్ ప్రకారం నడుచుకుంటున్నాడని మండిపడ్డారు. మిత్ర పక్షంగా ఉండి ఎవరూ మాట్లాడని విధంగా వీర్రాజు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ప్రతి ఏడు చంద్రబాబు ఆస్తులు ప్రకటిస్తూనే ఉన్నారు. అయినా ఆయన మీద విమర్శలా? అంటూ ఆశ్చర్యపోయారు.

మిత్ర పక్షంగా ఉన్న సోము వీర్రాజు జగన్ ఆస్తుల గురించి ఎపుడు అయినా ప్రశ్నించారా? అంటూ నిలదీసారు. జగన్ కు వీర్రాజుకు ఉన్న ఒప్పందం బయట పెట్టాలన్నారు. సీఎం మంచితనాన్ని చేతకానితనంగా సోము వీర్రాజు తీసుకోవద్దని హెచ్చరించారు. వీర్రాజు వ్యాఖ్యలపై మంత్రి మాణిక్యాలరావు స్పందించాలని డిమాండ్ చేశారు. సోము వీర్రాజు ఎజెండా బిజెపి నా?  వైసీపీ నా అనేది తేల్చి చెప్పాలన్నారు.

వీర్రాజు అంత నిజాయితీ పరుడు అయితే ఎమ్మెల్సీ పదవి చంద్రబాబు దగ్గర ఎందుకు తీసుకున్నావ్. పదవి పొందినపుడు తెలియదా చంద్రబాబు అవినీతి చేసాడో లేదో? అంటూ మండిపడ్డారు. వైసీపీ నుండి సోము వీర్రాజు ఎంత ట్రేడింగ్ చేసాడో చెప్పాలన్నారు. వీర్రాజు వాక్యాలు చూసి తన రక్తం మరిగిపోతోంది వెంకన్న అన్నారు.

చంద్రబాబు ఎవరిని మాట్లాడవొద్దు అని చెప్పినా నేను చూస్తూ ఉండలేక మాట్లాసుతున్నాని కూడా అన్నారు. వీర్రాజు  బిజెపి నేతలకు తెలిసే మాట్లాడుతున్నాడా ? లేక సొంత ఏజండా తో మాట్లాడుతున్నాడా రాష్ట్ర బిజెపి నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.

వీర్రాజు వాక్యలపై చర్చకు సిద్ధమన్నారు. దేశంలో ఉన్న అగ్రనేతలు అందరూ చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడు అంటే వీర్రాజు  ఇలా మాట్లాడటాన్ని వెంకన్న తప్పుపట్టారు. మిత్రం పక్షంగా ఉండి శత్రు పక్షంగా మాట్లాడుతున్నారు. వీర్రాజు మహా నేత అని మాట్లాడారు. మహానేత అంటే ఎవరు? వై ఎస్ రాజశేఖర్ రెడ్డా? లేకపోతే ఎవరో చెప్పాలని బుద్దా డిమాండ్ చేశారు.