Asianet News TeluguAsianet News Telugu

బొబ్బిలిరాజా కు మంత్రి పదవి మీద టిడిపిలో వ్యతిరేకత

అగ్ర కులానికి మంత్రి పదవి ఇస్తే  జిల్లాలో సంఖ్యరీత్యా మెజారిటీ అయిన వెనకబడిన వర్గాల  ప్రజలు దూరమవుతారని ఎమ్మెల్యేల వాదన

TDP MLAs oppose cabinet berth to sujaya krishna Rangarao of vizianagaram

 

 

TDP MLAs oppose cabinet berth to sujaya krishna Rangarao of vizianagaramబొబ్బిలి రాజా, ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకు వ్యతిరేకంగా తెలుగుదేశంపార్టీలో తిరుగుబాటు మొదలయింది. ఆయన మంత్రి పదవి ఇస్తే విజయనగరం అంటుకునేలా ఉంది. ఆయన దయచేసి మంత్రి పదవి ఇవ్వవద్దని  ఎమ్మెల్యలే కొండపల్లి అప్పలనాయుడు, కోళ్ల లలితకుమారి, మీసాల గీత, ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్, గుమ్మడి సంధ్యారాణి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడ్ని స్వయంగా కలిసి కూడా తమ వ్యతిరేకతను  వ్యక్తం చేశారు. జిల్లాలో మంత్రి పదవి ఇస్తే బిసిలకే ఇవ్వాలన్నది వారి డిమాండ్. సుజయ్ కృష్ణా రంగారావు వెలమ.

 

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం బొబ్బిలిరాజా పేరు క్యాబినెట్ మంత్రి పదవి కోసం పరిశీలనలో ఉంది.


ఓసీకి మంత్రి పదవి ఇస్తే  జిల్లాలో సంఖ్యరీత్యా మెజారిటీ అయిన వెనకబడిన వర్గాల  ప్రజలు దూరమవుతారని వారు హెచ్చరించినట్లు తెలిసింది.

 

విజయనగరం జిల్లాలో బీసీ సంఘాలమద్దతు కూడా వారు కూడగట్టుకున్నారు. అయితే, ముఖ్యమంత్రి దీనిని ఖాతరుచేస్తున్నట్లు లేదు. వైసిపి నుంచి పార్టీలోకి వచ్చిన సుజయ కృష్ణ రంగారావు అర్ధికంగా కూడా బాగా  బలమయిన వాడయినందున ఆయనకే మంత్రి పదవికి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయినట్లు చెబుతున్నారు.

 

నిజానికి మహిళలుగా లలిత, గీతలు మంత్రి పదవి ఆశిస్తున్నారు.  పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు మరదలయిన మృణాళిని తప్పిస్తే తమలో ఒకరికి ఈ పదవి వస్తుందనేది వారి ఆశ.  అయితే,  మృణాళిని తప్పిస్తే  సుజయకు పదవి ఇవ్వాలని కళా సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు.

 

సుజయకు ఇపుడు పార్టీలో పెద్దగా పట్టు లేదు. 2019 నాటికి  పార్టీ మీద పట్టుకోసం వారు బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటపుడు మంత్రి పదవి వస్తే బొబ్బిలి రాజా  పార్టీ పదవులను కూడా తమ వర్గానికి తెప్పించుకుంటాడని  శాసన సభ్యులలో ఉంది. అయితే, మంత్రి పదవి ఏర చూపే సుజయ కృష్ణ రంగారావుని వైసిపి నుంచి తెలుగుదేశం లోకి లాక్కున్నారని, అందువల్ల ఆయన మంత్రి పదవి ఇవ్వకపోవడం ఉండదని పార్టీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. అంతేకాదు, పార్టీ నిర్ణయానికి  కట్టుబడి ఉండాలని ముఖ్యమంత్రి తనను కలుసుకున్న ఎమ్మెల్యే, ఎమ్మ్యెల్సీలకు ముఖ్యమంత్రి సూచించనట్లు ఆయన తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios