కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా మిత్రపక్ష నేత వినూత్నంగా నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖిరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వామపక్షాలు ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపుకు వైసిపి, కాంగ్రెస్, జనసేన ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. జనాల మూడ్ చూసిన తర్వాత టిడిపి కూడా చివరకు మద్దతు తెలిపింది.

అందులో భాగంగానే కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం టిడిపి ఎంఎల్ఏ బోడె ప్రసాద్ గుండుకొట్టించుకున్నారు. రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అన్ని విధాలుగా అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ నిరసనగా ఎంఎల్ఏ బోడె ప్రసాద్ ఉయ్యూరు లో  మెయిన్ రోడ్ పై గుండు కొట్టించుకున్నారు.  ఎంఎల్ ఏతో పాటు ఎంఎల్సీ రాజేంద్రప్రసాద్, నేతలు, కార్యకర్తలు గంటకు పైగా రోడ్ పై నిసరన గా బైఠాయించారు.