Asianet News TeluguAsianet News Telugu

జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేకే ...కరోనా సోకిన డిప్యూటీ సీఎం పక్కరాష్ట్రానికి: టిడిపి ఎమ్మెల్యే సంచలనం

రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విజృంచిస్తుంటే ప్రభుత్వంలో మాత్రం చలనం లేదని టిడిపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. 
 

TDP MLA Sensational Comments on AP Govt Over Corona treatment
Author
Amaravathi, First Published Jul 14, 2020, 9:07 PM IST

అమరావతి: మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా కరోనా  పరీక్షలు చేస్తున్నామని మంత్రులు డబ్బా కొడుతున్నారని.. కానీ కరోనా టెస్టుల కోసం సేకరించిన వేల సంఖ్యలో  శాంపిల్స్  వృధాపై ఏ ఒక్కరూ మాట్లాడటం లేదని టిడిపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. రాష్ర్టంలో కరోనా రోజురోజుకూ విజృంచిస్తుంటే  ప్రభుత్వంలో మాత్రం చలనం లేదని... ఐసిఎమ్ఆర్ సూచనలను లెక్కలేని తనంగా తీసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందన్నారు. 

రాష్ట్రంలో కరోనా నిర్ధారణ కోసం సేకరించిన 74 వేల శాంపిళ్లు వృధా అయినా ఆరోగ్య శాఖ మంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి? అని ప్రశ్నించారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే  27 వేల శాంపిల్స్ వృధా అయ్యాయని... సేకరించిన స్వాబ్ లు పనికిరాకుండా పోయాయన్నారు. దీన్ని బట్టి కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఏవిధంగా ఉందో అర్థమవుతోందని మండిపడ్డారు. 

పరీక్షా కేంద్రాల సంఖ్య పెంచకుండా నిర్లక్ష్యంగా అధికార యంత్రాంగం వ్యవహరించడం దుర్మార్గమన్నారు. అనుభవం లేరి వారితో నమూనాలు సేకరించి ఎవరి ప్రాణాలు తీయాలని చూస్తున్నారు? అని నిలదీశారు. కరోనా నివారణలో ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని... క్షేత్ర స్థాయిలో జరుగతున్న పరిస్థితులను మంత్రులు గానీ, అధికారులు గానీ గమనించకపోవడం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. 

read more   కరోనా మృతుల అంత్యక్రియలకు ఆర్థిక సాయం... జగన్ కీలక నిర్ణయం

నాణ్యత లేని వీటీఎం ప్యాకింగులను కొనుగోలు చేసి విపత్తుల సమయంలోనూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. దేశంలో తామే నెంబర్ వన్ గా కరోనా పరీక్షలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ ప్రటనలు చేసుకుంటున్నారని విమర్శించారు. మరి శాంపిళ్ల వృధాపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. 

కరోనా పేషంట్లకు నాణ్యమైన వైద్యం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.  దీనికి నిదర్శనమే డిప్యూటీ సిఎం ఆంజాద్ భాషా పక్క రాష్ట్రానికి వెళ్లి వైద్యం చేయించుకోవడమేనని అన్నారు. క్వారంటైన్ లో ఉన్న వారికి సరైన ఆహారం అందించడం లేదని... పురుగులు పడిన నీళ్లను, పాడై పోయిన ఆహారాన్ని అందిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. 

ఒక్కొక్కరికి రోజుకు రూ.500లు ఖర్చు పెడుతున్నామని చెప్పి అనుయాయులకు కాంట్రాక్టులు కట్టబెట్టి విచ్చల విడిగా ప్రజల సొమ్మును జేబుల్లోకి నింపుకుంటున్నారని ఆరోపించారు. క్వారంటైన్ సెంటర్లలో ఉండాలంటే రోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని... వీటికంటే ఇంటి దగ్గరే పుష్టిగా ఉండొచ్చన్న అభిప్రాయం వారిలో ఉందన్నారు. ప్రభుత్వం ఇదే విధానాన్ని అవలంభిస్తే ఏపీ కూడా మరో అమెరికా అవుతుందేమోనని డోలా బాల వీరాంజనేయ స్వామి  ఆందోళనగా వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios