Asianet News TeluguAsianet News Telugu

కరోనా మృతుల అంత్యక్రియలకు ఆర్థిక సాయం... జగన్ కీలక నిర్ణయం

కోవిడ్‌ కారణంగా మరణించిన వారి అంత్యక్రియల కోసం ప్రభుత్వమే రూ.15వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. 

AP govt financial assistance to corona death families
Author
Amaravathi, First Published Jul 14, 2020, 8:18 PM IST

అమరావతి: కోవిడ్‌ కారణంగా మరణించిన వారికి అంత్యక్రియల విషయంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల దృష్ట్యా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మృతిచెందిన వారి అంత్యక్రియల కోసం ప్రభుత్వమే రూ.15వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు తక్షణం చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. 
దీనికి సంబంధించి వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. 

రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో నివారణ చర్యలపై చర్చించేందుకు ఏపీ సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సంబంధిత వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డితో పాటు ఆ శాఖకు చెందిన పలువురు ముఖ్య అధికారుల సమావేశమైన సీఎం పలు అంశాలపై చర్చించారు. 

రాష్ట్రంలో కోవిడ్‌–19 పరీక్షలు, కేసుల వివరాలను ముఖ్యమంత్రి జగన్ కు అధికారులు తెలియజేశారు. ఈ క్రమంలో క్వారంటైన్‌ సెంటర్ల మీద ఫోకస్‌ పెంచాలని సీఎం సూచించారు. వాటిలో పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాలని... పేషంట్స్ కి అందించే భోజనం నాణ్యత మీద కూడా దృష్టి పెట్టాలన్నారు. వచ్చే 7 రోజులు అధికారులు వాటిపై డ్రైవ్‌ చేయాలని ఆదేశించారు. 

read more  టెస్టుల్లో నెగెటివ్ వచ్చినా పాజిటివ్‌గా పరిగణిస్తూ వైద్యం: సీఎంకు తెలిపిన అధికారులు

కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, క్వారంటైన్‌ కేంద్రాలలో మంచి ప్రమాణాలు పాటించేలా చేయాల్సిన బాధ్యత అధికారులదే అని సీఎం అన్నారు. అందుకు ఎలాంటి మార్పులు చేయాలన్నా చేయండి అని పేర్కొన్నారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, క్వారంటైన్‌ కేంద్రాల నుంచి పిర్యాదుల స్వీకరణకు ఆయా కేంద్రాల వద్ద కాల్‌ సెంటర్‌ నంబర్‌తో కూడిన హోర్డింగ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

అంతేకాకుండా ఫీడ్‌బ్యాక్‌ కోసం ప్రతి రోజూ ప్రతి సెంటర్, ఆస్పత్రికీ కాల్స్‌ చేయాలని... ప్రతి క్వారంటైన్‌ కేంద్రం, కోవిడ్‌ కేర్‌ సెంటర్, కోవిడ్‌ ఆస్పత్రులకు ఖచ్చితంగా ర్యాండమ్‌గా కనీసం 3 ఫోన్‌ కాల్స్‌ చేయాలని సూచించారు. క్రమం తప్పకుండా ఆస్పత్రులను, క్వారంటైన్‌ సెంటర్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. 

 సేవల్లో నాణ్యత అనేది చాలా ముఖ్యమైనదని...కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, కోవిడ్‌ ఆస్పత్రులు, క్వారంటైన్‌ సెంటర్లలో నాణ్యతపై దృష్టిపెట్టని అధికారులకు నోటీసులు జారీచేయాలని సీఎం ఉన్నతాధికారులకు సూచించారు. దీర్ఘకాలం కోవిడ్‌తో పోరాడాల్సిన అవసరం ఉందని... పనుల్లో నాణ్యత లేకపోతే ఫలితాలు సాధించలేమని అన్నారు. 

కోవిడ్‌ ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవలపై పూర్తి దృష్టి పెట్టాలని... జీఎంపీ ప్రమాణాలున్న మందులనే చికిత్స పొందుతున్న వారికి అందించాలన్నారు. రానున్న కాలంలో అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవడానికి శాశ్వత కేంద్రాలు ఉండాలని... అవి ఎక్కడ ఉన్నాయన్న దానిపై ప్రజలకు తెలియజేయాలని సూచించారు.ఎవరికైనా కోవిడ్‌ సోకిందన్న అనుమానం ఉంటే వారు ఎక్కడకు వెళ్లాలి? ఎవరికి కాల్‌ చేయాలి? వారు ఏం చేయాలన్న దానిపై చైతన్యం తీసుకురావాలని... ఆ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించే హోర్డింగ్స్‌ను విస్తృతంగా పెట్టించాలన్నారు సీఎం. 

కరోనా టెస్టులు ఒక ఎస్‌ఓపీ ప్రకారం చేయాలని..ఎవరికి చేయాలి అన్న దానిపై స్పష్టమైన ప్రోటోకాల్‌ ఉండాలని నిర్దేశించారు. టెస్టులు చేయాల్సిన వారి కేటగిరీలను స్పష్టంగా పేర్కొనాలన్నారు. 

కోవిడ్‌ కేసు వస్తే ఏ ఆస్పత్రి కూడా వైద్యానికి నిరాకరించకూడదని... అలా నిరాకరిస్తే కఠినంగా వ్యవహరించాలని సీఎం అధికారులకు సూచించారు. అలా కరోనాకు వైద్యాన్ని నిరాకరించే హాస్పిటల్ పర్మిషన్‌ రద్దు చేస్తామన్నారు. ఆమేరకు కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios