వైఎస్ జగన్ కి మద్దతు పలికిన టీడీపీ ఎమ్మెల్యే

tdp mla r.krishnaiah supports jagan words on kapu reservation
Highlights

వైఎస్ జగన్ రాజకీయ నాయకుడిగా కంటే వాస్తవికవాదిగా మాట్లాడారని అభిప్రాయపడ్డారు. 

కాపు రిజర్వేషన్ల విషయంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాగా.. ఓ టీడీపీ ఎమ్మెల్యే మాత్రం జగన్ ని సమర్థిస్తున్నారు. కాపు రిజర్వేషన్ల విషయంలో వైయస్ జగన్ అనుసరించిన విధానం సరైనదేనని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే, బీసీ నేత ఆర్ కృష్ణయ్య అన్నారు. వైఎస్ జగన్ రాజకీయ నాయకుడిగా కంటే వాస్తవికవాదిగా మాట్లాడారని అభిప్రాయపడ్డారు. 

రిజర్వేషన్‌ అనేది కేంద్రం పరిధిలోని అంశమని, రిజర్వేషన్లు ఒక పరిమితి మించి ఇవ్వాలనుకుంటే రాజ్యాంగ సవరణ అవసరవుతుందని కృష్ణయ్య వెల్లడించారు. కాగా కాపులకు రిజర్వేషన్లు సాధ్యం కాదని, అది కేంద్రం పరిధిలో ఉన్న అంశమని జగన్ అన్న సంగతి తెలిసిందే. అయన వ్యాఖ్యల్ని ప్రముఖ కాపు నేత ముద్రగడ పద్మనాభం తప్పుబట్టారు. కాపుల విషయంలో జగన్ అన్యాయంగా మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు. 

loader