‘‘ట్వీట్లు పెట్టడం తప్ప పవన్‌కు ఏం తెలియదు.. తన చేతలతో తానే దిగజారిపోయారు’’

First Published 21, Jul 2018, 4:31 PM IST
TDP Leader panchumarthi anuradha commments on pawan kalyan
Highlights

తెలుగుదేశం పార్టీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆ పార్టీ మహిళా నేత పంచుమర్తి అనురాధ

తెలుగుదేశం పార్టీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆ పార్టీ మహిళా నేత పంచుమర్తి అనురాధ.. పవన్‌ కల్యాణ్‌కు రాజకీయాలపై కనీస అవగాహన లేదని.. తోచినట్లుగా ట్వీట్లు పెట్టడం తప్పించి ఆయనకు ఏం తెలియదంటూ అనురాధ మండిపడ్డారు. చంద్రబాబుపై ట్వీట్లు  పెట్టే పవన్ కేంద్రప్రభుత్వంపై ఎందుకు ట్వీట్లు పెట్టడం లేదని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రిపై పవన్ కల్యాణ్ అనవసర విమర్శలు చేసి రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోయారని.. విమర్శించారు. పవన్ తన చేతలతో.. చేష్టలతో చేజేతులా తన స్థాయిని దిగజార్చుకున్నారని ధ్వజమెత్తారు. అవిశ్వాసం వీగిపోయినా టీడీపీ ఎంపీలు పార్లమెంటు సాక్షిగా ఏపీకి జరిగిన అన్యాయంపై గళమెత్తారని అనురాధ ప్రశంసించారు.

టీడీపీ వ్యవహరశైలిని తప్పుబడుతూ.. ‘‘గజినీ’’ సినిమాలో హీరో లాగా తెలుగుదేశం పార్టీ కూడా మెమొరీ లాస్‌తో బాధ పడుతుందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్లు చేశారు.. ఇన్ని రోజులు ఆ పార్టీ ఏం చేసిందన్న విషయాన్ని టీడీపీ నేతలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని చెబుతూ ట్వీట్లు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. 

loader