కాపు రిజర్వేషన్ల విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై  మాజీ మంత్రి, టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు.  జులై 28వ తేదీ కాపులకు బ్లాక్ డే అని... వారి ఆశయాలను ప్రభుత్వం అడియాశలు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. చినరాజప్ప ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించారు.

ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ల విషయంపై మాట్లాడారు. కాపులకు ఐదుశాతం రిజర్వేషన్ చెల్లదని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం చూస్తే.... ఆయన కాపు ద్వేషులుగా పనిచేస్తున్నారని తమనకు అనిపిస్తోందన్నారు. మొత్తం రెడ్డి సామాజిక వర్గమే కాపు ధ్వేషులుగా పనిచేస్తోందన్నారు.

గతంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి... ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు అంతా కాపుల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు అధికమయ్యాయని.. ఆరుగురిని పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తలపై, నాయకులపై దాడులు పెరిగిపోయాయన్నారు. ఇదేనా రాజన్న రాజ్యమని ఆయన ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టు, రాజధాని తదితర అభివృద్ధి పనులపై వైసీపీ ప్రభుత్వ వైఖరి కారణంగా బ్యాంకులు, పరిశ్రమలు వెనక్కు వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, పార్టీ నాయకులు పాల్గొన్నారు

కాపులకు ద్రోహం చేసిందెవరో మీకు తెలీదా.. జ్యోతుల నెహ్రూ కి విజయసాయి పంచ్

కాపు రిజర్వేషన్ల సెగ: ముగ్గురు సభ్యులతో కమిటీ వేసిన జగన్

నోటికి ప్లాస్టర్ వేసుకుంటా: జగన్‌కు ముద్రగడ ఘాటు లేఖ

కాపు రిజర్వేషన్లు: చంద్రబాబు చేతికి జగన్ ఆస్త్రం

కాపు రిజర్వేషన్... సీఎం జగన్ పై చినరాజప్ప విమర్శలు

మేమంటే ఎందుకంత కసి: జగన్‌పై జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలు

కాపు రిజర్వేషన్లపై జగన్ ఫోకస్: కాపు నేతలతో భేటీ

కాపు కోటా: చంద్రబాబుకు వైఎస్ జగన్ కౌంటర్ వ్యూహం