కాపు రిజర్వేషన్లు: చంద్రబాబు చేతికి జగన్ ఆస్త్రం

First Published Jul 29, 2019, 12:14 PM IST

అమరావతి: కాపు రిజర్వేషన్ల విషయంలో తన వైఖరిని స్పష్టం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి అస్త్రం అందించినట్లే కనిపిస్తున్నారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.

కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో అమలు చేయలేకపోయారు. శాసనసభలో తీర్మానం చేసి రాజ్యాంగంలోని షెడ్యూల్ లో చేర్చాలని కేంద్రాన్ని కోరారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే మొత్తం రిజర్వేషన్ల శాతం యాభైకి మించుతోంది. రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఉండకూడదనే సుప్రీంకోర్టు తీర్పునకు విఘాతం కలుగుతోంది. 9వ షెడ్యూల్లో చేర్చడానికి కూడా కేంద్రం వ్యతిరేకత ప్రదర్శించింది. ఆ కారణంగా నేరుగా చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు కల్పించలేకపోయారు.

కాపులను బిసీ కోటాలో చేర్చి, రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాలకు బీసీలు తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించారు. తమ రిజర్వేషన్ల కోటా తగ్గుతుందని వారు వరుస ప్రభుత్వాల ప్రయత్నాలను వ్యతిరేకించారు. బీసీలను వ్యతిరేకం చేసుకోవడం ఇష్టంలేని ప్రభుత్వాలు కాపులకు మరో మార్గంలో రిజర్వేషన్లు కల్పించడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగానే 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తులు చేశాయి. ఇదే పద్ధతిని చంద్రబాబు అనుసరించారు.

ఈలోగా కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు (ఈబీసీలకు) పది శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ముందుకు వచ్చింది. దీన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. ఈబీసీలకు కల్పించే పది శాతం రిజర్వేషన్లలో కాపులకు ఐదు శాతం కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీన్ని వైఎస్ జగన్ ఆచరణ సాధ్యం కాదని అంటున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ కాపు నాయకులు తీవ్రంగా జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడుతున్నారు.

కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి తగిన సూచనలు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం మంజునాథ్ కమిషన్ ను నియమించింది. అయితే, అది ఆచరణ రూపం దాల్చలేదు. ఇదే సమయంలో కేంద్రం అంగీకరిస్తే తప్ప కాపులకు రిజర్వేషన్లు అమలు చేయలేమని, అందువల్ల తాను ఆ హామీ ఇవ్వలేనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు బహిరంగంగానే ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడమనేది తాను అధికారంలోకి వచ్చినా కూడా తన చేతుల్లో ఉండదని ఆయన స్పష్టంగానే చెప్పారు.

ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు (ఈబీసీలకు) పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీని చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. ఈ పది శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తామని ఆయన హామీ ఇవ్వడమే కాకుండా ఈ మేరకు 2017లో శాసనసభలో తీర్మానం చేసి, అందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. అయితే, కేంద్రం వద్ద అది పెండింగులో ఉంది.

కాపులను బీసీల జాబితాలో చేర్చి రిజర్వేషన్ల కోటాను పెంచడానికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నం మాదిరిగానే ఈ ప్రయత్నం కూడా బెడిసికొట్టే అవకాశం ఉంది. ఈబీసీ కోటాలో ఐదు శాతం రిజర్వేషన్లను కాపులకు కేటాయించడానికి కేంద్రం అనుమతి మాట అటుంచితే న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఈబీసీ కోటాను ఆశించే ఇతర అగ్రవర్ణాలు న్యాయస్థానాలకు వెళ్తే ఆ చిక్కులు తప్పకపోవచ్చు. బహుశా, దీన్ని గమనించే జగన్ కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని చెప్పి ఉంటారు.

ముస్లింలకు తెలంగాణలో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయడానికి తమిళనాడు తరహా విధానాన్ని ముందుకు తెచ్చారు. తమిళనాడులో రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఉన్నాయి. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం వల్ల ఆ రిజర్వేషన్లు చట్టబద్దతను సంతరించుకున్నాయి. అదే రీతిలో 9వ షెడ్యూల్లో చేర్చి ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి వెసులుబాటు కల్పించాలని ఆయన కూడా కేంద్రాన్ని కోరారు. కానీ అది సాధ్యం కాలేదు.

కేంద్రం ఈబీసీ రిజర్వేషన్లు కల్పించడానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడదానికి కూడా కేసీఆర్ యోచన చేశారు. అంటే, కాపులకు ఈబీసీ కోటాలో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగానే తాను కూడా చేయాలని ఆయన అనుకున్నారు. అయితే, అలా చేస్తే ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులను గమనించి కేసిఆర్ వెనక్కి తగ్గినట్లు చెబుతారు.

ఆచరణసాధ్యం కాని, తన చేతుల్లో లేని హామీలను ఇవ్వకూడదనే కచ్చితమైన వైఖరి కారణంగా జగన్ కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి ఉంటారు. అయితే, ఆయన మాత్రం కాపు రిజర్వేషన్లపై తన వైఖరిని స్పష్టం చేయడం ద్వారా చంద్రబాబుకు ఓ అస్త్రం అందించినట్లే భావించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఇది తాజా వివాదంగా మారే అవకాశం ఉంది.

ఐదు శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి పూనుకోవాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. తాజా పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు నేతలు చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబుతో చర్చించి ఆందోళనకు శ్రీకారం చుట్టే యోచన కూడా వారు చేస్తున్నట్లు అర్థమవుతోంది

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?