డోన్‌లో టీడీపీ నేతల పోటాపోటీ ర్యాలీలు: మీసం మేలేసిన సుబ్బారెడ్డి
డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నేతలు పోటా పోటీగా బలప్రదర్శనకు దిగారు. నిన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ర్యాలీ నిర్వహిస్తే ఇవాళ ధర్మవరం సుబ్బారెడ్డి ర్యాలీ చేపట్టారు.
కర్నూల్: తెలుగుదేశం పార్టీ టిక్కెట్ల కోసం ఆ పార్టీ నేతలు చివరి వరకు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి కర్నూల్ జిల్లా డోన్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టీడీపీ టిక్కెట్టు కేటాయించింది. అయితే మూడేళ్ల క్రితం డోన్ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా ధర్మవరం సుబ్బారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు.
also read:విచారణకు రావాలి:వైఎస్ఆర్‌సీపీ రెబెల్ ఎమ్మెల్సీలకు మండలి చైర్మెన్ నోటీస్
అయితే టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో ధర్మవరం సుబ్బారెడ్డికి బదులుగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి చోటు దక్కింది. దీంతో ధర్మవరం సుబ్బారెడ్డి రగిలిపోతున్నాడు. నిన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించారు. అయితే ధర్మవరం సుబ్బారెడ్డి ఇవాళ డోన్ లో బల ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా సుబ్బారెడ్డి మీసం మేలేశాడు. డోన్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి తీరాలని సుబ్బారెడ్డి భావిస్తున్నారు.
also read:టీడీపీలోకి వసంత కృష్ణ ప్రసాద్: మైలవరం టిక్కెట్టు ఎవరికో?
2019 అసెంబ్లీ ఎన్నికల్లో డోన్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ డిప్యూటీ సీఎం కే.ఈ. కృష్ణమూర్తి సోదరుడు కే.ఈ. ప్రతాప్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అయితే ప్రతాప్ పోటీ చేయడానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో సుబ్బారెడ్డిని అప్పట్లో నియోజకవర్గ ఇంచార్జీగా చంద్రబాబు ప్రకటించారు.
also read:'సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకతే': వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరిక
గతంలో ఇదే అసెంబ్లీ స్థానం నుండి కే.ఈ. కృష్ణమూర్తి పలు దఫాలు ప్రాతినిథ్యం వహించాడు. కే.ఈ. కృష్ణమూర్తి సోదరుడు కే.ఈ. ప్రభాకర్ కూడ ఇదే అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించారు.1978 నుండి1989 వరకు కే.ఈ. కృష్ణమూర్తి ఈ స్థానం నుండి విజయం సాధించారు. 1999లో కే.ఈ. ప్రభాకర్ ఈ స్థానం నుండి గెలుపొందారు.2004 నుండి కోట్ల సుజాతమ్మ ఈ స్థానం నుండి గెలుపొందారు. 2009లో కే.ఈ. కృష్ణమూర్తి ఈ స్థానంలో నెగ్గారు. ఈ దఫా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టీడీపీ టిక్కెట్టు కేటాయించింది.