వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఇద్దరు రెబెల్ ఎమ్మెల్సీలను శాసనమండలి చైర్మెన్  మోషేన్ రాజు విచారించనున్నారు.ఈ మేరకు  ఇవాళ  నోటీసులు జారీ చేశారు.

అమరావతి: వైఎస్ఆర్‌సీపీ నుండి ఇతర పార్టీల్లో చేరిన ఇద్దరు ఎమ్మెల్సీలకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మెన్ మోషేన్ రాజు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5వ తేదీన తుది విచారణకు హాజరు కావాలని శాసనమండలి చైర్మెన్ మోషేన్ రాజు ఆ నోటీసులో పేర్కొన్నారు.

also read:టీడీపీలోకి వసంత కృష్ణ ప్రసాద్: మైలవరం టిక్కెట్టు ఎవరికో?

ఇటీవలనే వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీలు సి. రామచంద్రయ్య తెలుగు దేశం పార్టీలో చేరారు. మరో ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేనలో చేరారు. వీరిద్దరిపై వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం శాసనమండలి చైర్మెన్ మోషేన్ రాజుకు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు మేరుగు మురళి, లేళ్ల అప్పిరెడ్డి గతంలోనే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు శాసనమండలి చైర్మెన్ విచారణ నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 5వ తేదీన తుది విచారణకు రావాలని శాసనమండలి చైర్మెన్ మోషన్ రాజు వీరిద్దరికి నోటీసులు పంపారు.

also read:రెండో జాబితాపై పవన్ కసరత్తు: 10 మందికి చోటు?

ఈ నెల 5వ తేదీన తుది విచారణకు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు శాసనమండలి చైర్మెన్ అవకాశం కల్పించారు. అయితే ఈ నెల 5వ తేదీన ఈ ఇద్దరు విచారణకు హాజరౌతారా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. 

also read:'సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకతే': వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరిక

ఇటీవలనే క్రితం తెలుగు దేశం, వైఎస్ఆర్‌సీపీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం లేకపోలేదు. మరో వైపు ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.