విజయవాడ: కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి తప్పుకోవాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వర రావు స్పందించారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకోవాలని ముద్రగడ పద్మనాభం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ నిర్ణయం తీసుకుంటూ ఆయన కాపు సామాజికవర్గానికి ఓ బహిరంగ లేఖ రాశారు. 

ఉద్యమం నుంచి ముద్రగడ పద్మనాభం తప్పుకోవడం సరైంది కాదని బొండా ఉమామహేశ్వర రావు అన్నారు. నాయకత్వం వహించేవారిపై విమర్శలు సహజమేనని ఆయన సోమవారం మీడియా సమావేశంలో అన్నారు. ముద్రగడపై సోషల్ మీడియాలో విమర్శలు చేసేది వైసీపీ వాళ్లేనని ఆయన అన్నారు. 

Also Read: కాపు కోటా ఉద్యమానికి ముద్రగడ గుడ్ బై: జగన్ కు ఊరట, చంద్రబాబుకు షాక్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముద్రగడ కాపు రిజర్వేషన్లపై లేఖ రాసిన తర్వాతనే సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం కాపులకు కల్పించిన ఐదు శాతం రిజర్వే,న్లను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన చెప్పారు. ఇది కాపులకు నిజంగా ద్రోహమేనని ఆయన అన్నారు. 

కాపు జాతి కోసం, రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ముందుకు రావాలని ఆయన కోరారు. త్వరలో 13 జిల్లాలో కాపు నాయకులతో విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తానని బొండా ఉమా చెప్పారు.  

Also Read: షాకింగ్: కాపు రిజర్వేషన్ ఉద్యమంపై ముద్రగడ సంచలన లేఖ