కాపు కోటా ఉద్యమానికి ముద్రగడ గుడ్ బై: జగన్ కు ఊరట, చంద్రబాబుకు షాక్

First Published 13, Jul 2020, 1:35 PM

కాపు రిజర్వేషన్ ఉద్యమానికి మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాకినాడ: కాపు రిజర్వేషన్ ఉద్యమానికి మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన కాపు సోదరసోదరీమణులకు బహిరంగ లేఖ రాశారని అంటున్నారు. కాపులకు రిజర్వేషన్లు సాధించే ఉద్దేశంతో ఆయన కాపు ఉద్యమాన్ని ప్రారంభించారు.

సొంత సామాజిక వర్గానికి చెందినవారే తనపై కుట్రలు చేస్తున్నట్లు ఆయన భావిస్తున్నారు. కొంత మందితో కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దలు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నరని తన బహిరంగ లేఖలో చెప్పారు. దానికి తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఆయన తెలిపారు. ఆ కారణంగానే ఆయన ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ముద్రగడ పద్మనాభం నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఊరట లభించే అవకాశం ఉంది. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని తాము హామీ ఇవ్వలేనని, అది కేంద్రం పరిధిలోది కాబట్టి తాను హామీ ఇచ్చి మోసం చేయదలుచుకోలేదని ఆయన తన పాదయాత్ర సందర్భంలోనే స్పష్టం చేశారు. కాపులకు ఆయన వివిధ సంక్షేమ పథకాలను ప్రకటించి అధికారంలోకి రాగానే అమలు చేయడానికి పూనుకున్నారు

కేంద్ర ప్రభుత్వం ఈబీసీలకు కల్పించిన పది శాతం రిజర్వేషన్లలో ఆంధ్రప్రదేశ్ లోని కాపులకు ఐదు శాతం కేటాయించాలని అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ఆ తీర్మానం ప్రతిని పంపించారు. అయితే, అది కార్యరూపం దాల్చలేదు. దాని ద్వారా ఎన్నికల్లో కాపు సామాజిక వర్గాన్ని తన వేపు తిప్పుకోవాలనే చంద్రబాబు వ్యూహం కూడా బెడిసికొట్టింది.

కాపు రిజర్వేషన్లపై వైఎస్ జగన్ చేతులెత్తేసినట్లే. ఈ స్థితిలో కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి ముద్రగడ పద్మనాభం స్వస్తి చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది జగన్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. నిజానికి, ముద్రగడ ప్రధాన లక్ష్యం చంద్రబాబు అని అందరూ అనుకుంటూనే ఉన్నారు. తాను తీవ్రమైన మనస్తాపానికి గురైనట్లు పద్మనాభం చెప్పారు.

కాపు రిజర్వేషన్ వల్ల తాను తీవ్రంగా నష్టపోయినట్లు కూడా చెబుకున్నారు. మానసికంగా, ఆర్థికంగా నష్టపోయానని ఆయన చెప్పారు. రాజకీయంగా కూడా తనకు పెద్ద యెత్తున నష్టం జరిగిందని అన్నారు. నిజానికి, కాపు రాజకీయ నేతల్లో ముద్రగడకు మంచి పలుకుబడి ఉంది. పైగా మంచి పేరు కూడా ఉంది. ఆయన రాజకీయంగా ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

loader