కాకినాడ: కాపు కోటా సాధన ఉద్యమం గురించి కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విస్తుపోయే వ్యాఖ్యలు చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందినవారికి ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దలు తనపై కాపు సోదరులతో చేయిస్తున్న సోషల్ మీడియాలో చేయిస్తున్న దాడులకు తాను మానసికంగా కృంగిపోయినట్లు ఆయన తెలిపారు. 

ముద్రగడ పద్మనాభం రాసి బహిరంగ లేఖ పూర్తి పాఠం కింద ఇ,స్తున్నాం.

ఈ మధ్య పెద్దవారు చాలా మంది మన సోదరుల చేత నేను మానసికంగా కృంగిపోయే విధంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానికి మీడియా ద్వారా దాడులు చేయిస్తున్నారు. ఈ విధంగా వారు దాడులు చేయవలసిన అవసరం ఎందుకు ఎంచుకున్నారో నాకైతే అర్థం కాలేదు. 

ఉద్యమం చేసిన కాలంలో నేను వసూలు చేసిన నిధులు గాని, పారిశ్రామిక వర్గాలను బెదిరించి సంపాదించిన డబ్బులు గాని, అప్పటి ముఖ్యమంత్రి గారు, ఇప్పటు ముఖ్యమంత్రి గారి వద్ద లొంగిపోయి మూటలతో దండుకున్న కోట్లాది రూపాయలు, నన్ను నిత్యం విమర్శించే సోదరులకు పంచలేదనా, ఈ దాడికి కారణం?

నేను ఆ రోజు ఉద్యమంలోకి రావడానికి ముఖ్యకారణం చంద్రబాబు నాయుడు గారే! మన జాతికి బీసీ రిజర్వేషన్ ఇస్తాను అని ఇచ్చిన హామీ కోసం అన్న సంగతి మీకు తెలియనిది కాదు. ఈ ఉద్యమం ద్వారా డబ్బు గాని, పదవులు గాని పొందాలని ఏనాడూ అనుకోలేదు. ఉద్యమంలోకి వచ్చిన తరువాత ఆర్థికంగాను, ఆరోగ్యం పరంగాను చాలా నష్టపోయాను. రాజకీయంగా ఎంత నష్టపోయానో మీ అందరికి తెలుసు. కాని ఏ నష్టానికి ఎప్పుడు చింతించలేదు. 

తుని సభ, పాదయాత్ర ఘనంగా జరగడానికి కారణం నా గొప్ప కాదూ.... కాదు. అది అలా మంచిగా జరగడానికి కారమం జాతి యొక్క ఆకలి అన్న సంగతి గమనించండి. నా రాజకీయ జీవితంలో ఎన్నో పార్టీలు, కుల సభలు చూశాను, విన్నాను. ఏ సభకైనా చెప్పిన సమయానికి ప్రజలు ఆలస్యంగా చేరే అలవాటు ఉన్న సంగతి లోకానికి తెలుసు. కానీ  సభకు రెండు గంటలు ఆలస్యంగా రావడం కాదు, వేల మంది రెండు రోజుల ముందే చేరుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది, ఇది మరువలేని అనుభూతి. 

 

ఒకరు ఫోన్ చేసి మీ కష్టం ద్వారా వచ్చే ఫలితాన్ని ఇతరులు కొట్టేసేలాగుతున్నారు కాబట్టి ఇతరులు ఇచ్చిన స్టేట్ మెంటుకు సపోర్టు చేస్తూ మీరు నడిచేయండి అని సలహా ఇచ్చారు. ఎందుకు వారితో నడవాలి, ఆనాడు ఈ ఉద్యమం వెనకాల వారందరూ నడిచారా? వారు నడవనప్పుడు నేను నడవవలసిన అవసరం లేదు. ఎవరి ద్వారా అయినా రిజర్వేషన్ రానివ్వండి, దానికి అందరూ సంతోషపడుదాం అని చెప్పడం జరిగింది ఆనాడు అప్పటి ముఖ్యమంత్రిగారికి లేఖ రాస్తూ రిజర్వేషన్ ఇచ్చేయడం వల్ల నేను గొప్పవాడిని అయిపోతాను అని మీరు అభిప్రాయపడవచ్చు, దయచేసి మీ ఆఫీసులో పనిచేసే వారి పేరు మీద లేఖ తీసుకుని, పనిచేసి ఆ పేరు ప్రతిష్టలు మీరే పొందండి, ఫలితాన్న్ి ఆశించే మనిషిని కాదు అని ఆనాడే చెప్పడం జరిగింది.