Asianet News TeluguAsianet News Telugu

బాలకృష్ణ చేయిపడటమే అదృష్టమట....

  • ఫంక్షన్ హాలులో సెల్ఫీ దిగబోయిన ఓ అభిమాని చెంపను బుధవారం రాత్రి బాలయ్య చెళ్ళుమనిపించిన విషయం అందరికీ తెలిసిందే.
  • ఆ విషయం సోషల్ మీడియాలో బాగా ప్రచారమైంది.
  • దాంతో టిడిపి అడ్డంగా సమర్ధించుకుంటోంది.
TDP kurnool distrct president sees luck in the slap of Balayya

నంద్యాల రోడ్డుషోలో బాలకృష్ణ ఓ అభిమానిని కొట్టటాన్ని టిడిపి అడ్డంగా సమర్ధించుకుంటోంది. రోడ్డుషో తర్వాత ఓ ఫంక్షన్ హాలులో సెల్ఫీ దిగబోయిన ఓ అభిమాని చెంపను బుధవారం రాత్రి బాలయ్య చెళ్ళుమనిపించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయం సోషల్ మీడియాలో బాగా ప్రచారమైంది. దాంతో టిడిపి అడ్డంగా సమర్ధించుకుంటోంది. కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ ‘బాలకృష్ణ చేతిలో దెబ్బతిన్నందుకు అభిమాని పొంగిపోయుంటాడ’ని చెప్పటం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే, బాలయ్య చేయిపడటం ఓ అదృష్టమట. మరి అంతటి అదృష్టాన్ని సోమిశెట్టి తానే ఎందుకు దక్కించుకోకూడదు?

Follow Us:
Download App:
  • android
  • ios