అమరావతి:అచ్చెన్నాయుడు దొంగా, టెర్రరిస్టా తెల్లవారుజామునే వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా సమయంలో 300 మంది పోలీసులతో ఇంటికెళ్తారా అని ఆయన ప్రశ్నించారు.

శుక్రవారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  మీడియాతో మాట్లాడారు.  టీడీఎల్పీ ఉప నాయకుడు అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు.మాస్క్‌లు లేకుండానే ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడు ఇంట్లోకి ప్రవేశించారన్నారు. కరోనా నిబంధనలు ఏసీబీ అధికారులకు ఎందుకు వర్తించవని ఆయన ప్రశ్నించారు.కనీసం అచ్చెన్నాయుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండానే ఆయనను తీసుకెళ్లారని  బాబు ఆరోపించారు.

ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు పేరును విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక  ఎక్కడా కూడ ప్రస్తావించలేదన్నారు.అచ్చెన్నాయుడు దొంగా, టెర్రరిస్టా తెల్లవారుజామునే వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందన్నారు. కరోనా సమయంలో 300 మంది పోలీసులతో ఇంటికెళ్తారా అని ఆయన ప్రశ్నించారు.

also read:నకిలీ బిల్లులతో అవినీతి: అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై మంత్రి కన్నబాబు

ఆపరేషన్ చేసుకొన్న వ్యక్తికి కనీసం మందులు కూడ తెచ్చుకోకుండా దుర్మార్గంగా వ్యవహరించారని బాబు మండిపడ్డారు. అరెస్ట్ విషయంలో కనీసం ఆయన భార్యకు కూడ సమాచారం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.

ఇవాళ ఉదయం  ఉదయం నుండి రాష్ట్రం మొత్తం ఎక్కడెక్కడో తిప్పుతూ సాయంత్రం విజయవాడకు తీసుకొచ్చారన్నారు. సీఎం జగన్ కక్ష సాధింపునకు అంతు లేదా అని ఆయన ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్లిన తర్వాతే చేతి రాతతోనే అరెస్ట్ విషయమై సమాచారం ఇచ్చారన్నారు.

ఈ తరహా పద్దతిని తానను ఎక్కడా కూడ చూడలేదన్నారు.కక్షపూరితంగా వ్యవహరించడం మంచి పద్దతి కాదని ఆయన హెచ్చరించారు.విజిలెన్స్ రిపోర్టులో లేదు, ఏసీబీ రిపోర్టును ప్యాబ్రికేట్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. అచ్చెన్నాయుడుపై అసెంబ్లీ సాక్షిగా కూడ అవమానపర్చేవిధంగా మాట్లాడారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.

also read:మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్: ఈఎస్ఐ స్కామ్ ఏమిటి?

ప్రజల సమస్యల పరిష్కారం కోసం అచ్చెన్నాయుడుతో పాటు ఆ కుటుంబం పోరాటం చేసిందన్నారు.  ప్రస్తుతం బీసీలను లక్ష్యంగా చేసుకొని వైసీపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందన్నారు. విచారణకు రానని అచ్చెన్నాయుడు చెప్పారా... ఎందుకు ఆయనను అరెస్ట్ చేశారో చెప్పాలని బాబు ప్రశ్నించారు.

ఈ నెల 16వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే అదే సమయంలో టీడీఎల్పీ ఉపనేతను కనీసం నోటీసు కూడ అరెస్ట్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.ప్రధాన ప్రతిపక్షానికి చెందిన డిప్యూటీ లీడర్ ను ఈ రకంగా అరెస్ట్ చేశారు, ఇతర విపక్షాలకు చెందిన నేతలు కూడ తమతో కలిసి రావాలని చంద్రబాబునాయుడు కోరారు.

తనపై ఉన్న అవినీతి ఆరోపణలను కూడ అందరికి రుద్దేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ కు నిరసనగా ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఇంట్లోనే కూర్చొని నిరసనలు చేయాలని ఆయన కోరారు.