ఆగస్ట్ లో చంద్రబాబు రాయలసీమ పర్యటన ఖరారు... వివరాలివే...
ఆంధ్ర ప్రదేశ్ లోని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించేందుకు వచ్చే నెలలో టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు.

అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ పర్యటనకు సిద్దమయ్యారు. వైసిపి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందని టిడిపి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితి ఎలా వుందో ప్రజలకు తెలియజేయడానికి చంద్రబాబు వాటి పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. ఆగస్ట్ నెలంతా ఆంధ్ర ప్రదేశ్ లోని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా ఆగస్ట్ మొదటివారంలో చంద్రబాబు రాయలసీమల పర్యటన ఖరారయ్యింది.
ఆగస్ట్ 1,2 తేదీల్లో అంటే రెండు రోజుల పాటు కర్నూల్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు పరిశీలించనున్నారు. అనంతరం 2వ తేదీన సాయంత్రం ఉమ్మడి కర్నూల్ జిల్లా టిడిపి నేతలతో పరిశీలించనున్నారు. ఇక ఆగస్ట్ 3న గండికోట రిజర్యాయర్ ను పరిశీలించి అనంతరం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. 4న కళ్యాణదుర్గంలోని భైరవానితిప్ప ప్రాజెక్ట్ తో పాటుపేరూర్ లో ఇతర ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. 4వ తేదీ సాయంత్రం ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
Read More లోకేష్ పాదయాత్ర అడ్డుకోవాలనే.. తాడేపల్లి నుంచే ఆదేశాలు : వినుకొండలో ఘర్షణపై జీవీ ఆంజనేయులు
చంద్రబాబు రాయలసీమ పర్యటనకు సంబంధించిన వివరాలను మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. రాయలసీమ భవిష్యత్ తో ఆటలాడుతున్న సీఎం జగన్ బండారాన్ని ముఖ్యమంత్రి బయటపెట్టనున్నారని అన్నారు. జగన్ వైఫల్యాలను ఎండగట్టేందుకు చంద్రబాబు రాయలసీమ పర్యటన చేపట్టారని... రైతులు, ప్రజలు భారీసంఖ్యలో పాల్గొని పర్యననను విజయవంతం చేయాలని శ్రీనివాసులు సూచించారు.