విజయనగరం జిల్లా బోడికొండ కోదండరాముడి విగ్రహ ధ్వంసంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఒకేసారి టీడీపీ, బీజేపీ, వైసీపీ నేతల పర్యటనతో రామతీర్థం రణరంగంగా మారింది.

ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం చేరుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ప్రతిపక్షనేత మెట్ల మార్గం వద్ద కొబ్బరికాయ కొట్టి బోడికొండపైకి బయల్దేరారు.

ఆయన వెంట కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, టీడీపీ శ్రేణులు ఉన్నాయి. అయితే రామతీర్థంలో ఆలయానికి అధికారులు తాళం వేయడం విమర్శలకు తావిచ్చింది.

Also Read:సవాల్‌కు విజయసాయి సై: జగన్‌కు దమ్ములేదా...వేరే వాళ్లు మొరగడమేంటన్న లోకేశ్

చంద్రబాబు అక్కడికి చేరుకోవడానికి ముందే అధికారులు లాక్ వేశారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తాళం వేశారంటూ తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. ఆలయానికి తాళం వేసి ఉండటంతో చంద్రబాబు అక్కడి నుంచి వెనుదిరిగారు.

అయితే కొండమీద అధికారులతో జరిగిన సంఘటనపై బాబు ఆరా తీసి, కొనేరును పరిశీలించారు. అయితే చంద్రబాబు కంటే ముందే ఆలయాన్ని సందర్శించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.