Asianet News TeluguAsianet News Telugu

జగన్ స్వామ్యంలో ప్రజాస్వామ్యం జీవచ్చవం... ఎస్ఈసికి ఏమయ్యింది?: చంద్రబాబు ఆగ్రహం

పేదల భూములు వైసీపీ నేతలు కబ్జా చేసినట్లుగా ఎన్నికల ప్రక్రియను కూడా కబ్జా చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

TDP Chief Chandrababu fires on cm jagan and SEC
Author
Amaravathi, First Published Feb 28, 2021, 12:20 PM IST

గుంటూరు: వైసిపి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.  పంచాయితీ ఎన్నికల ఫలితాల తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీతో పోటీ పడలేక ఆస్తుల విధ్వంసానికి దిగడం సిగ్గుచేటన్నారు. బెదిరింపులు, దౌర్జన్యాలతో జగన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 

''పేదల భూములు వైసీపీ నేతలు కబ్జా చేసినట్లుగా ఎన్నికల ప్రక్రియను కూడా కబ్జా చేస్తున్నారు. తిరుపతిలో 20 ఏళ్లుగా టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు షాపును అక్రమంగా తొలగించడాన్ని ఖండిస్తున్నాం. పలాసలో బెదిరింపులకు గురి చేసి పోటీ చేసే అభ్యర్థులను వైసీపీలో చేర్చుకున్నారు.  పోటీ నుండి తప్పుకోకపోతే టీడీపీ అభ్యర్థులపై వైసీపీ విష పంజా విసురుతోంది'' అని ఆరోపించారు.

''జగన్ స్వామ్యంలో ప్రజాస్వామ్యం జీవచ్చమైంది. సీఎం జగన్ రెడ్డి ఆదేశాలతోనే రాష్ట్రంలో ఇలాంటి వికృతి చేష్టలకు వైసీపీ నాయకులు పాల్పడుతున్నారు. అధికార పార్టీ ఆగడాలపై ఎస్ఈసీ ఎందుకు స్పందించడం లేదు.? పోటీ చేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన కనీస బాధ్యత ఎస్ఈసీ, పోలీసులపై వుంది. నామినేషన్ వేసినదగ్గర నుండి ఎన్నికలయ్యే వరకు ఏం జరగుతుందో అంతుబట్టని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది'' అంటూ చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. 

read more   కుప్పంలో చంద్రబాబు రోడ్ షో... మంగళహారతులు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం

కుప్పం జగన్ జాగీరు కాదని చంద్రబాబు అన్నారు. కుప్పంలోనే మకాం వేసి..వైసీపీకి డిపాజిట్ రాకుండా చేస్తానని స్పష్టం చేశారు. పుంగనూరులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు. ఇసుక అమ్ముతూ పేదల రక్తాన్ని జలగల్లాగా తాగుతున్నారన్నారు. రాజధాని, ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ ఉక్కు మొత్తం పోయాయని మండిపడ్డారు. 

జెట్ స్పీడుతో వైసీపీపై పోరాటం చేద్దామని బాబు పిలుపునిచ్చారు. నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో జనం బెంబేలెత్తిపోతున్నారన్నారు. పోలవరం, విశాఖ, అమరావతి అన్ని పోయాయని.. పోవడం తప్ప తెచ్చేవి ఏమీ లేదని వ్యాఖ్యానించారు. పుంగనూరులో పెద్దిరెడ్డికి డిపాజిట్ కూడా లేకుండా చేస్తానని అన్నారు. గేరు మార్చి తన తడాక చూపిస్తానని హెచ్చరించారు. రైతులను నిండా ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్ర చందన, ఇసుక స్మగ్లింగ్ ద్వారా పెద్దిరెడ్డి దోచుకుంటున్నారని ఆరోపించారు.

డబ్బులు తెచ్చి కుప్పంలో ఓటర్లకు పంచి వ్యస్థను నాశనం చేశారన్నారు. తెగించి ముందుకు పోవాలని కార్యకర్తలకు తెలిపారు. రౌడీ రాజ్యం నడుస్తోందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రెండో కుప్పం నియోజకవర్గం కడపల్లి పంచాయతీ పోడూరు గ్రామంలో పర్యటించిన చంద్రబాబు పీఈఎస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త క్రిష్ణప్ప కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మృతి చెందిన క్రిష్ణప్ప కుటుంబానికి పార్టీ తరపున రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని చంద్రబాబు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios