గుంటూరు: అమరావతి ఆందోళనలు 200రోజులైన సందర్భంగా ఈ ఉద్యమానికి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలిపారు.   రాష్ట్రం కోసం భూములు ఇచ్చిన రైతులు, మహిళలు, రైతుకూలీలకు అందరి ఆయన సంఘీభావం తెలిపారు. అన్ని మండలాల్లో జెఏసి చేపట్టిన సంఘీభావ కార్యక్రమాలు విజయవంతం చేయాలి ఆయన పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా ఆయన జూమ్ యాప్ ద్వారా నాయకులతో మాట్లాడారు. ''అమరావతి దేవేంద్రుడు రాజధాని... అటువంటి మహోన్నత చరిత్ర అమరావతికి ఉంది. అమరావతిని చంపాలని కుటిల ప్రయత్నాలు ఎవరు చేసినా అవి విఫలం అవుతాయి... ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత మనకు అద్భుతమైన రాజధాని నిర్మాణం చేయాలని భావించడం తప్పా'' అని ప్రశ్నించారు.

''రాజధాని నిర్మాణం చేయడం అనేది ప్రజలు కోసం. రాష్ట్రానికి మధ్యలో అమరావతి ఉంటుంది అని భావించి రైతులు ఉదారంగా ముందుకు వచ్చి వారి భూములు త్యాగం చేశారు.ప్రపంచంలో ఎక్కడా లేని విదంగా ల్యాండ్ పూలింగ్ లో స్వచ్ఛందముగా ముందుకు వచ్చి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించారు. కానీ వారి త్యాగాలకు విలువ లేకుండా వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయం వుంది'' అని చంద్రబాబు అన్నారు. 

read more  అమరావతి ఇష్యూ: మరోసారి జగన్ ని ఇరకాటంలోకి నెట్టిన రఘురామ

టిడిపి మండల పార్టీ అధ్యక్షులతో శుక్రవారం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ కోవిడ్ నామ్స్ పాటిస్తూ అన్ని మండలాల్లో జెఏసి ఆధ్వర్యంలో శనివారం జరిగే సంఘీభావ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం కోసం భూములు త్యాగం చేసి రోడ్ల పాలైన రైతులు, మహిళలు, రైతు కూలీలకు అండగా ఉండాల్సిన బాధ్యత రాష్ట్రంలో అన్ని జిల్లాల ప్రజలపై ఉందన్నారు. 

''అమరావతి పరిరక్షణ ఆందోళనలు రేపటికి 200రోజులు. రాష్ట్రం కోసం భూములు త్యాగం చేసిన రైతులు, మహిళలు, రైతుకూలీలకు అన్యాయం చేయడం హేయం. 200 రోజులుగా అమరావతి ప్రజానీకం ఆందోళనలు చేస్తున్నా వైసిపి ప్రభుత్వం పెడచెవిన పెట్టడం గర్హనీయం.  రాజధానిని 3 ముక్కలు చేసి పరిపాలనను మూడు ముక్కలాట చేయడం బాధాకరం. అటు భూములు కోల్పోయి, ఇటు కౌలు అందక, ఆదాయం లేక రైతాంగం, రైతు కూలీలు కుదేలయ్యారు. న్యాయం చేయమని ఆందోళనలు చేస్తున్న వేలాదిమంది రైతులు, కూలీలు, మహిళలపై అక్రమ కేసులు పెట్టారు, వందలాదిమందిని జైళ్లకు పంపారు. మొక్కులు తీర్చుకోడానికి వెళ్లే మహిళలపై లాఠీఛార్జీ చేశారు. అర్ధరాత్రిదాకా పోలీసు స్టేషన్లలో మహిళలను నిర్బంధించారు. నానారకాల హింసలు పెట్టినా మొక్కవోని ధైర్యంతో పోరాడుతున్నారు'' అని చంద్రబాబు పేర్కొన్నారు. 
                                ----