చంద్రబాబుకు రిమాండ్.. రేపు ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపు, అలర్ట్ అయిన పోలీసులు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్ట్ రిమాండ్ విధించడంతో తెలుగుదేశం శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. చంద్రబాబు రిమాండ్‌కు నిరసనగా రేపు ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్ట్ రిమాండ్ విధించడంతో తెలుగుదేశం శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరసన చేస్తున్నాయి. ఇదిలావుండగా.. చంద్రబాబు రిమాండ్‌కు నిరసనగా రేపు ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను అధిష్టానం ఆదేశించింది. రోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రతి మండలంలో 144 సెక్షన్ అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
ALso Read: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం .. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్
అంతకుముందు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడకు ఏసీబీ కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు ఆయనకు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రబాబు రేపు సోమవారం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. జ్యూడిషియల్ రిమాండ్ ను హౌస్ అరెస్టుగా మార్చాలని చంద్రబాబు న్యాయవాదులు చేసిన వినతిని కోర్టు తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైలుకు వెళ్తున్న తొలి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే.