వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరైన ఈ ఎన్నికలో టిడిపి అభ్యర్ధి ఆసం రఘురామిరెడ్డి విజయం సాధించారు. మొత్తం 40 మంది కౌన్సిలర్లున్న మున్సిపాలిటిలో రఘురామిరెడ్డికి 31 ఓట్లు వచ్చాయి.

మొత్తానికి కడప జిల్లా ప్రోద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ స్ధానాన్ని టిడిపి సొంతం చేసుకుంది. కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి, ఒత్తిడి పెట్టి ఎలాగైతేనేం మున్సిపాలిటీ తమదే అనిపించుకున్నది. వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరైన ఈ ఎన్నికలో టిడిపి అభ్యర్ధి ఆసం రఘురామిరెడ్డి విజయం సాధించారు. మొత్తం 40 మంది కౌన్సిలర్లున్న మున్సిపాలిటిలో రఘురామిరెడ్డికి 31 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నిక ఎప్పుడో జరగాల్సిందన్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే అప్పట్లో టిడిపికి తగినంత బలం లేనికారణంగా రెండు సార్లు వాయిదా పడింది. అప్పట్లోనే ఎన్నిక జరిగిఉంటే వైసీపీ, టిడిపిలోని చీలకవర్గం కౌన్సిలర్లు బలపరచిన ముక్తియార్ గెలిచి ఉండేవారు. ఆ విషయాన్ని గ్రహించిన కారణంగానే టిడిపి నేతలు సమావేశ మందిరంలో రచ్చ రచ్చ చేసి రెండుసార్లూ ఎన్నికను వాయిదా వేయించారు. సరే అందుకు అధికారులు కూడా సహకరించారనుకోండి అది వేరే సంగతి.

రెండోసారి కూడా ఎన్నికను వాయిదా వేయించిన టిడిపి నేతలు తమకు ఎదురుతిరిగిన కౌన్సిలర్లలో అత్యధికులను రకరకాల మార్గాల్లో దారికితెచ్చుకున్నట్లు వైసీపీ ఆరోపిస్తోంది. ఛైర్మన్ స్ధానం తమదే అని నమ్మకం వచ్చిన తర్వాతనే ఎన్నిక నిర్వహణకు తేదీని నిర్ణయించారు. దాంతో తెరవెనుక జరుగుతున్న పరిణామాలను గ్రహించిన వైసీపీ ఛైర్మన్ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. దాంతో ఛైర్మన్ స్ధానం టిడిపి వశమైంది.