Asianet News TeluguAsianet News Telugu

టి సచివాలయం ఖాళీ

  • పది రోజుల్లో టి సచివాలయం ఖాళీచేయాలి
  • కెసిఆర్ ఆదేశాలు
  • బిఆర్కె భవన్ లో తాత్కాలిక వసతి
     
T secretariat to vacate

పది రోజుల్లో తెలంగాణా సచివాలయాన్ని ఖాళీ చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేసారు. ఈ మేరకు సోమవారం ఇందుకు సంబంధించిన ఉత్తరు్వలు జారీ అయ్యాయి. వాస్తు ప్రకారం సచివాలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి  తెలంగాణా ఆధీనంలో ఉన్న నాలుగు బ్లాకులను మొత్తం కూలగొట్టి కొత్తగా వాస్తు శాస్త్రానికి అనుగుణంగా నిర్మించాలని నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే అందుకు మంచి ముహూర్తం కోసం ఇంత కాలం వేచి ఉన్నారు. అయితే, వాస్తు పండితులు పెట్టిన ముహూర్తం కుదరగానే పది రోజుల్లో మొత్త నాలుగు బ్లాకులను ఖాళీ చేయాలని  సిఎం ఆదేశాలు జారీ చేసారు. నాలుగు బ్లాకులు ఖాళీ అవ్వగానే మొత్తం ప్రాంగణాన్ని ప్రభుత్వం నిర్ణయించిన ఆర్కిటెక్ట్ కు అప్పజెప్పవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈలోగా అన్నీ ప్రభుత్వ శాఖలకు బూర్గుల రామకృష్ణారావు భవన్ లో తాత్కాలిక నివాసం కల్పించినట్లు కూడా ప్రభుత్వ పేర్కొన్నది. ఇదిలా వుండగా ఏపి ప్రభుత్వానికి కేటాయించిన సచివాలయంలోని నాలుగు భవనాలను వెంటనే తెలంగాణా ప్రభుత్వానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కెసిఆర్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం గవర్నర్ కు వినతి పత్రాన్ని ఇచ్చింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios