స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం: మాజీ ఎంపీ రాయపాటి కోడలి విచారణ

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదం కేసులో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు మమతను పోలీసులు విచారిస్తున్నారు. ఆమె రమేష్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు.

Swarna Palace fire accident: Rayapati daughter-in-law Mamatha questioned

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు మాజీ పార్లమెంటు సభ్యుడు, టీడీపీ నేత రాయపాటి సాంబశివ రావు కోడలు మమతను విచారిస్తున్నారు. మమతకు రెండు రోజుల క్రితం విజయవాడ పోలీసులు నోటీసు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో సూచించారు. 

అందులో భాగంగా శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి రాయపాటికి ఇంటికి వెళ్లిన పోలీసులు మమతను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విజయవాడకు తీసుకుని వెళ్లి విచారిస్తున్నారు. స్వర్ణ ప్యాలెస్ లో అగ్ని ప్రమాదం సంభవించి కోవిడ్ రోగులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. రమేష్ ఆస్పత్రికి చెందిన రమేష్ బాబు పరారీలో ఉన్నారు. 

Also Read: స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం: నెగిటివ్ వచ్చిన వారికి చికిత్స, విచారణలో వాస్తవాలు

పోలీసుల తీరును రాయపాటి సాంబశివ రావు కుమారుడు రంగారావు ఖండించారు. మమత గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో పనిచేస్తోందని, విజయవాడలో జరిగిన ప్రమాదానికి ఏ విధమైన సంబంధం ఉంటుందని ఆయన అన్నారు. ప్రభుత్వం తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుందని ఆయన అన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మమతను ఇబ్బంది పెడుతున్నారని ఆయన అన్నారు. 

Also Read: స్వర్ణ ప్యాలెస్‌లో అగ్ని ప్రమాదం: రమేష్ ఆసుపత్రి యాజమాన్యానికి, బంధువులకు నోటీసులు

మమత ఇటీవల కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నట్లు తెలుస్తోంది. రమేష్ ఆస్పత్రి నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్నిప్రమాదం సంభవించి పది మంది మరణించారు, మరికొంత మంది గాయపడ్డారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios