Asianet News TeluguAsianet News Telugu

జగన్ సర్కార్‌కు సుప్రీం షాక్: ఏపీ సర్కార్ పిటిషన్ కొట్టివేత, 4 వారాల్లో రంగులు తొలగించాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాలకు రంగులు వేయడంపై  ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను బుధవారం నాడు సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Supreme court quashes ap government petition over colours on government buildings
Author
Amaravathi, First Published Jun 3, 2020, 12:26 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాలకు రంగులు వేయడంపై  ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను బుధవారం నాడు సుప్రీంకోర్టు కొట్టివేసింది.

నాలుగు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న రంగులను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లేకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని ప్రకటించింది.గ్రామ పంచాయితీ కార్యాలయాలకు ప్రస్తుతమున్న మూడు రంగులకు అదనంగా మరో రంగు వేయాలని ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను ఏపీ హైకోర్టు మే 22వ తేదీన సస్పెండ్ చేసిన తెలిసిందే. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం.

also read:ఏపీ సర్కార్‌కు హైకోర్టు షాక్: జీవో 623 సస్పెండ్

ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు ఏపీ హైకోర్టు తీర్పును సమర్ధించింది. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయితీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వైసీపీ రంగులను తొలగించాలని ఆదేశాలను జారీచేసింది హైకోర్టు.  దీంతో ఈ మూడు రంగులతో పాటు మరో రంగును కూడ వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాలుగు రంగులు వేయాలని ఈ జివో స్పష్టం చేసింది.

గ్రామ పంచాయితీ కార్యాలయాలపై తొలుత మూడు రంగులను వేయాలని ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మూడు రంగులు వైసీపీ పార్టీ కలర్ ను పోలి ఉన్నాయని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కలర్లను తొలగించాలని కూడ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మరో వైపు ఈ మూడు కలర్లకు అదనంగా మరో కలర్ ను వేయాలని జీవో జారీ చేసింది. ఈ విషయాన్ని ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేసింది. నాలుగు రంగులను పంచాయితీ కార్యాలయాలకు వేయాలని నిర్ణయం తీసుకోవాలని జారీ చేసిన జీవోను హైకోర్టు ఇవాళ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు,సుప్రీంకోర్టు ఆదేశాలను  కూడ ప్రభుత్వం పట్టించుకోలేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మూడు రంగులతో పాటు, మరో రంగు కూడ ఒక్కో అంశానికి సంబంధించినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని ఈ నెల 28న హైకోర్టులో హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే విషయమై ఈ నెల 5వ తేదీన 623 జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.


 

Follow Us:
Download App:
  • android
  • ios