Asianet News TeluguAsianet News Telugu

ఏపీ సర్కార్‌కు హైకోర్టు షాక్: జీవో 623 సస్పెండ్

గ్రామ పంచాయితీ కార్యాలయాలకు ప్రస్తుతమున్న మూడు రంగులకు అదనంగా మరో రంగు వేయాలని ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు సస్పెండ్ చేసింది.ఈ విషయమై ఈ నెల 28వ తేదీ లోపుగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

Andhra pradesh high court suspends 623 g.o
Author
Amaravathi, First Published May 22, 2020, 11:21 AM IST


అమరావతి: గ్రామ పంచాయితీ కార్యాలయాలకు ప్రస్తుతమున్న మూడు రంగులకు అదనంగా మరో రంగు వేయాలని ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు సస్పెండ్ చేసింది.ఈ విషయమై ఈ నెల 28వ తేదీ లోపుగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

గ్రామ పంచాయితీ కార్యాలయాలపై తొలుత మూడు రంగులను వేయాలని ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మూడు రంగులు వైసీపీ పార్టీ కలర్ ను పోలి ఉన్నాయని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కలర్లను తొలగించాలని కూడ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మరో వైపు ఈ మూడు కలర్లకు అదనంగా మరో కలర్ ను వేయాలని జీవో జారీ చేసింది. ఈ విషయాన్ని ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేసింది. నాలుగు రంగులను పంచాయితీ కార్యాలయాలకు వేయాలని నిర్ణయం తీసుకోవాలని జారీ చేసిన జీవోను హైకోర్టు ఇవాళ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

also read:జగన్ సర్కార్‌కి షాక్: 623 జీవో సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

హైకోర్టు,సుప్రీంకోర్టు ఆదేశాలను  కూడ ప్రభుత్వం పట్టించుకోలేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయమై ఈ నెల 28వ తేదీలోపుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయితీరాజ్ శాఖ  కార్యదర్శి, ఈసీలకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ మూడు రంగులతో పాటు, మరో రంగు కూడ ఒక్కో అంశానికి సంబంధించినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని ఈ నెల 28న హైకోర్టులో హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే విషయమై ఈ నెల 5వ తేదీన 623 జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios