ఆంధ్ర ప్రదేశ్ లో వివాదాస్పదంగా మారి రాజకీయ ప్రకంపనలు సృష్టించిన కాపు రిజర్వేషన్ల గురించి టాలీవుడు స్టార్ సుమన్ స్పందించారు. ఈ డిమాండ్ ఇప్పటిది కాదని చాలా ఏళ్లుగా కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం జరుగుతూనే ఉందని ఆయన అన్నారు. కాపులకు రిజర్వేషన్ ఇస్తే వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేసే అవకాశం ఉందని, అందువల్లే అధికార పక్షాలు త్వరితగతిన నిర్ణయం తీసుకోలేక పోతున్నాయన్నారు. అయితే కాపులు రిజర్వేషన్లు పొందడం అంత ఈజీ కాదని సుమన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.