అమరావతి: షెడ్యూల్ ప్రకారంగానే టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు ప్రకటించారు.బుధవారం నాడు మంత్రి ఒంగోలు మీడియాతో మాట్లాడారు. జూలై 10వ తేదీ నుండి రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

తెలంగాణలో పరీక్షలు రద్దు చేసినా ఏపీలో మాత్రం పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తేల్చి చెప్పారు. 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లకే పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు..

also read:తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు గ్రేడింగ్‌పై కసరత్తు

స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఏపీలో రెండు సార్లు టెన్త్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ లోపుగా కరోనా కేసులు పెరిగిపోవడంతో పరీక్షలను నిర్వహించలేదు. 
ఈ ఏడాది జూలై 10 వ తేదీ నుండి పరీక్షలునిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

also read:కరోనా దెబ్బ: ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా వేసిన సర్కార్

తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. విద్యార్థులందరిని పాస్ చేసింది. మరోవైపు విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. తమిళనాడు ప్రభుత్వం కూడ తెలంగాణ బాటలోనే పరీక్షలను రద్దు చేసింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షలను యధాతథంగా కొనసాగిస్తామని ప్రకటించింది.