టెన్త్ పరీక్షలు రద్దు చేయడంతో విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చే విషయమై విద్యాశాఖ అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్: టెన్త్ పరీక్షలు రద్దు చేయడంతో విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చే విషయమై విద్యాశాఖ అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు.

కరోనా నేపథ్యంలో తెలంగాణలో టెన్త్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా ఈ నెల 8వ తేదీన సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందరు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశారు.
అయితే విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చే విషయంలో ఏం చేద్దామనే విషయమై ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తోంది.టెన్త్ విద్యార్థులకు ప్రీ ఫైనల్ వరకు నిర్వహించిన పరీక్ష్లల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

also read:తెలంగాణ బాటలోనే తమిళనాడు: టెన్త్ పరీక్షలు రద్దు, పై తరగతులకు విద్యార్థులు ప్రమోట్

మంగళవారం నాడు ప్రభుత్వ పరీక్షల విభాగానికి చెందిన అధికారులు సమావేశమయ్యారు. అంతర్గత పరీక్షలకు విద్యార్థులకు 20 మార్కులను కేటాయించనున్నారు.విద్యార్థుల అంతర్గత పరీక్షల మార్కులను ఎస్ఎస్‌సీ బోర్డు పోర్టల్ కు అప్‌లోడ్ చేసే ముందు ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయో కూడ హెడ్ మాస్టర్ల సంతకాలను బోర్డు అధికారులు తీసుకొంటారు. 

గ్రేడింగ్ విధానంపై అధికారులతో అడ్వకేట్ జనరల్ ను అధికారులు కలిశారు. పరీక్షల విభాగం అధికారులు ముసాయిదాను తయారు చేస్తే ప్రభుత్వం ఆమోదిస్తే వెంటనే జీవోను విడుదలను జారీ చేయనున్నారు.ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు కనీసం 10 నుండి 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.