తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ విద్యాసంస్థ ‘‘గీతం’’ నూతన అధ్యక్షుడిగా ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ, రెండో అల్లుడు శ్రీభరత్ నియమితులయ్యారు. సోమవారం జరిగిన గీతం సొసైటీ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.

కొద్దిరోజుల వరకు గీతం ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన ఎంవీవీఎస్ మూర్తి అమెరికాలోని అలస్కాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు మరో ముగ్గురు కూడా ఆ ప్రమాదంలో మరణించారు. మూర్తి..తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా, మాజీ ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నారు.

గీతం విశ్వవిద్యాలయాన్ని స్థాపించి విశాఖ, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో సంస్థను విస్తరించారు. ఆయన మరణంతో గీతంకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి వచ్చింది. శ్రీభరత్ .. దివంగత ఎంవీవీఎస్ మూర్తి మనవడు.

అమెరికాలో ఇండస్ట్రీయల్ ఇంజీనీరింగ్ డిగ్రీని పాట్టాను పొంది.. 2016లో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎంఏ పూర్తి చేశారు. అనంతరం సినీనటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వినిని వివాహం చేసుకున్నారు.

విశాఖ చేరుకున్న ఎంవీవీఎస్ మూర్తి భౌతికకాయం.. మూర్తి నివాసం వద్ద విషాదఛాయలు

టీడీపీకి షాక్: రోడ్డు ప్రమాదాల్లో నేతలను కోల్పోతున్న టీడీపీ

ఎంవీవీఎస్ మూర్తి మరణం.. రోడ్డు ప్రమాదాల్లోనే నేతలను కోల్పోతున్నాం: చంద్రబాబు ఆవేదన

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత, ‘గీతం’ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం