తిరుమల అలిపిరి వద్ద అమిత్ షాకి హోదా సెగ

First Published 11, May 2018, 11:37 AM IST
Special category status to AP: Amit shah faces protest at Tirumala
Highlights

అమిత్ షాకి వ్యతిరేకంగా నిరసనలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి హోదా సెగ తగిలింది.  తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు అమిత్ షా శుక్రవారం ఇక్కడికి వచ్చారు. కాగా..  ఆయనను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు అలిపిరి చేరుకున్నారు.

అలిపిరి వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నల్ల  బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాగా.. అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న అలసత్వం గురించి తెలిసిందే. హోదా కోసం ఏపీ సీఎం చంద్రబాబు పోరాటం చేస్తున్నారు.

loader