బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి ఏపీసీఎం చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. స్వచ్ఛ భారత్ ప్రకటనల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోలు లేకుండా.. చంద్రబాబు, లోకేష్ ఫొటోలే పెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శించారు. 

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతిపై తెలుగుదేశం పార్టీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికధరలకు విద్యుత్ కొనుగోలుతో రాష్ట్రంపై రూ. 20వేల కోట్ల భారం పడుతుందని ఆయన అన్నారు. ఈ విషయంలో విద్యుత్‌ కొనుగోళ్లపై కోర్టుకెళ్తామని ఆయన అన్నారు.