హరీష్ కు కౌంటర్: హైదరాబాదుపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

First Published 25, Jul 2018, 6:48 PM IST
Somireddy Chandramohan Reddy retaliates Harish Rao
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలని తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన డిమాండుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భగ్గుమన్నారు. 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలని తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన డిమాండుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భగ్గుమన్నారు. హైదరాబాదుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  

హైదరాబాదు నగరాన్ని వదిలిపెట్టాల్సి వస్తోంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా అడుగుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. 

హైదరాబాదును రెండు రాష్ట్రాలకు రాజధానిగా అంగీరించి, హైదరాబాదు ఆదాయాన్ని రెండు రాష్ట్రాలకు పంచుతారా అని ఆయన హరీష్ రావును అడిగారు. ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. 

అందుకు అప్పుడు పాలించినవారు, ఇప్పుడు పాలిస్తున్నవారు అంగీకరించారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో మౌనంగా ఉన్నారని ఆయన చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్ని పార్టీలూ అడుగుతున్నా కూడా ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోమని చెబుతుంటే, దానికితోడు టీఆర్ఎస్ అడ్డం పడడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. 

loader