Asianet News TeluguAsianet News Telugu

(వీడియో) ఎంతటి పామైనా సలాం కొట్టాల్సిందే...

పాషాలో వశీకరణ శక్తే ఉందో ఏమో తెలీదు కానీ సంవత్సరాల తరబడి పాములను పట్టుకుని ఓ ఆటాడుకుంటున్నాడు. ఇప్పటి వరకూ సుమారు లక్ష పాములను పట్టుకున్నట్లు పాషా ‘ఏషియానెట్’ తో మాట్లాడుతూ చెప్పారు. పాములను పట్టుకుని ఆడుకోవటమే కాదండోయ్, పాము కాటుకు గురైన వారికి చికిత్స చేయటం కూడా భాషాకు వచ్చు.

Snakes that salute to the pasha

పామును చూస్తే జనాలు ఆమడదూరం పారిపోతారు. పామంటే అంత భయం జనాలకు. అటువంటిది యూకూబ్ పాషా మాత్రం పాము కనబడితే చాలు ఓ ఆటాడుకుంటాడు. అది ఎంత పెద్ద పామైనా కానీండి ఏమాత్రం లెక్క చేయడు. విచిత్రమేమంటే పాములే పాషాకు సలాం చేస్తాయి. మరి పాషాలో వశీకరణ శక్తే ఉందో ఏమో తెలీదు కానీ సంవత్సరాల తరబడి పాములను పట్టుకుని ఓ ఆటాడుకుంటున్నాడు. ఇప్పటి వరకూ సుమారు లక్ష పాములను పట్టుకున్నట్లు పాషా ‘ఏషియానెట్’ తో మాట్లాడుతూ చెప్పారు.

పాములను పట్టుకుని ఆడుకోవటమే కాదండోయ్, పాము కాటుకు గురైన వారికి చికిత్స చేయటం కూడా పాషాకు వచ్చు. విషసర్వాల కాటుకు గురైన ఎందరి ప్రాణాలనో కాపాడారు. జయశంకర్ జిల్లా మంగపేటకు చెందిన పాషా అంటే చుట్టుపక్కల తెలియని వాళ్ళు లేరు. మనోడు అంతటి ఫేమస్ మరి. పాషా ఉన్నంత వరకూ ఎంతటి పామైనా సరే గీత గీసినట్లు ఆగిపోతుందంతే.                                                                 

వృత్తిరీత్యా ఆర్‌ఎంపీ వైద్యుడిగా వృద్ధులు, పేదలు, చిన్న పిల్లలకు తనకు తోచిన వైద్యం చేస్తూంటారు. మండలంలో ఎవరి ఇంట్లోకైనా పాము వచ్చిందంటే పాషాను పిలవాల్సిందే. వెంటనే అక్కడికి వెళ్లి ఎంతటి విష సర్పానైనా అలవోకగా పట్టుకుని ఆడిస్తూ చూపరులను ఆకట్టుకుంటారు.

తాజాగా బుధవారం కోమటిపల్లి క్రాస్‌ రోడ్డులోని రైస్‌మిల్లులో పెద్ద త్రాచుపాము వచ్చింది. వెంటనే యజమాని పిలుపునందుకున్ పాషా అక్కడ వాలిపోయారు. నిలువెత్తు పడగతో భయంకరంగా ఉన్న పామును పట్టేసుకున్నారు. అంతేకాకుండా కోపంతో బుసలు కొడుతున్న త్రాచును కొద్దిసేపటి తర్వాత తన దారికి తెచ్చుకున్నారు. తర్వాత దానితో గంటపాటు విన్యాసాలు చేయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తర్వాత పాము విషం పిండుకుని మళ్ళీ ఆ పామును సమీప అడవిలో వదిలేశారు. ఎవరికైనా సహాయం కావాల్సివస్తే 9440713550 కు ఫోన్‌ చేయమని పాషా చెబుతున్నారు.  

 

 

Follow Us:
Download App:
  • android
  • ios