ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్సాఆర్ అభిమానులు టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టమని పిలుపునిచ్చారు. అసత్యాల ప్రచారంలో ఎల్లో మీడియాను లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకోమన్నారు. అధికార మదం తలకెక్కి పోలీసులను పంపితే భయపడేదిలేదన్నారు.

రాబోయే రోజుల్లో వైసీపీ తెలుగుదేశంపార్టీపై మరింత రెచ్చిపోనుంది. సోషల్ మీడియా వార్ ఊహించని మలుపు తిరిగింది. చంద్రబాబునాయుడు, లోకేష్ పై సెటైర్లు వేస్తున్నారన్న కారణంగా పవర్ పంచ్ అడ్మిన్ ఇంటూరి రవికిరణ్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే కదా? ఆ వేడి చల్లారక ముందే వైసీపీ కార్యాలయంపైన పోలీసులు దాడి చేయటంతో బాగా వేడి పుట్టించింది. ఇదే విషయమై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పందించారు. టిడిపిపై నిర్భయంగా దండెత్తండంటూ పిలుపునివ్వటం గమనార్హం. దాంతో రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ నేరుగా, వైసీపీ మద్దతుదారులు, సానుభూతిపరులు టిడిపిపై మరింత రెచ్చిపోనున్నారు.

జగన్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్సాఆర్ అభిమానులు టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టమని పిలుపునిచ్చారు. అసత్యాల ప్రచారంలో ఎల్లో మీడియాను లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకోమన్నారు. అధికార మదం తలకెక్కి పోలీసులను పంపితే భయపడేదిలేదన్నారు. ప్రజాస్వామ్యయుత తిరుగుబాటు చేయాల్సిన అవసరం వచ్చిందని జగన్ అభిప్రాయపడ్డారు. ఒక విధంగా సిఎం, లోకేష్ అరాచకాలపై జగన్ యుద్ధం ప్రకటించినట్లే. ప్రభుత్వానికి దిమ్మతిరిగేలా నిర్భయంగా దండెత్తాలని చెప్పారు. చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలపై ప్రజాస్వమ్య పద్దతుల్లో దాడులు చేయాలని గట్టిగా చెప్పారు.

రాష్ట్రంలో అసలే ముందస్తు ఎన్నికల జ్వరం మొదలైంది. ఇటువంటి సమయంలో అనవసరంగా ప్రభుత్వం సోషల్ మీడియాను కెలికింది. దాంతో వేలాది నెటజన్లు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. వైసీపీని నేరుగా ఏమీ చేయలేక ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న, టిడిపికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సోషల్ మీడియాను భయపెడదామని ప్రయత్నిస్తోంది. అంటే, సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపితే వైసీపీని నియంత్రించినట్లుగా చంద్రబాబు, లోకేష్ భ్రమపడుతున్నట్లున్నారు.

సోషల్ మీడియాలో కూడా పనిగట్టుకుని చంద్రబాబు, లోకేష పై వ్యతిరేకంగా వస్తున్నది తక్కువ. వారు మాట్లాడిన మాటలు, తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మత్రమే సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయ్. వైసీపీ అధినేత జగన్ పైనే కాకుండా వైసీపీ పైన కూడా టిడిపి వెబ్ సైట్ లో కూడా పుంకాను పుంకాలుగా సెటైర్లు వస్తున్న విషయాన్ని మాత్రం చంద్రబాబు, లోకేష్ మరచిపోయినట్లుగా నటిస్తున్నారు. ఇక్కడే సమస్య మొదలైంది. అందుకనే జగన్ టిడిపి ప్రభుత్వంపై ఒక విధంగా యుద్ధమే ప్రకటించారు.