నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో చంద్రబాబునాయుడు ఎవరిని ఎంపిక చేసినా తనకు శిరోధార్యమేనని ఎంఎల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి చెప్పారు.
నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో చంద్రబాబునాయుడు ఎవరిని ఎంపిక చేసినా తనకు శిరోధార్యమేనని ఎంఎల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి చెప్పారు. చక్రపాణి సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి ఓ వైపు పోటీ విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకు అధినేతనే బ్లాక్ మైల్ చేసేందుకు కూడా ప్రయత్నించారు. ఈ పరిస్ధితుల్లో తాజాగా చక్రపాణి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ మొదలైంది. అంటే నంద్యాలలో పోటీ చేసే విషయమై అన్నా, దమ్ములు చెరో మాట మాట్లాడుతుంటం గమనార్హం. మండలి ఛైర్మన్ చక్రపాణి ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈరోజు శిల్పా మీడియాతో మాట్లాడారు.
తనకు వరుసగా రెండోసారి ఎంఎల్సీగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. నంద్యాల సీటు విషయంలో తాను మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరించానని స్పష్టం చేసారు. మరి మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా తన సోదరుడిని ఒప్పించారా లేక తన సోదరుడి తరపున చంద్రబాబును ఒప్పించేందుకు ప్రయత్నించారా అన్న విషయమే తేలటం లేదు. పైగా నంద్యాలలో గెలిచే అభ్యర్ధి విషయంలో సర్వేలు కూడా చేయిస్తున్నట్లు చెప్పారు.
