Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబును సీఎం చేసేందుకు జగన్ ను దించాలా.. ? హరి రామజోగయ్య

టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడి (Chandrababu naidu) ని సీఎం చేసేందుకు వైస్ జగన్ (YS Jagan)ను సీఎం పదవి నుంచి దించేయాలా అని కాపు ఉద్యమ నేత, మాజీ ఎంపీ హరి రామజోగయ్య (hari ramajogaiah) ప్రశ్నించారు. రెండున్నరేళ్లు సీఎం పదవిని జనసేన (jana sena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan)కు ఇస్తామని చంద్రబాబు ప్రకటించాలని అన్నారు.

Should Jagan be brought down to make Chandrababu the CM? ? - hari ramajogaiah..ISR
Author
First Published Feb 5, 2024, 4:45 PM IST

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీని కోసం అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ ‘సిద్ధం’ పేరుతో సభ ఏర్పాటు చేసి ఎన్నికలకు తాము రెడీగా ఉన్నామని ప్రకటించింది. మరో వైపు ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూడా ఎన్నికల రణ రంగంలో యుద్ధం చేసేందుకు సన్నదమవుతున్నాయి. 

వావ్.. కాశ్మీర్ హిమపాతాన్ని రిపోర్టింగ్ చేసిన చిన్నారులు.. ఆనంద్ మహీంద్ర ఫిదా.. వైరల్

ఈ సారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని, రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ గతంలోనే స్పష్టం చేశారు. దీంతో రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే టీడీపీ ప్రతిపాదిస్తున్న సీట్ల సంఖ్యపై జనసేన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగాయి. 

రాముడి కోసం వస్తున్న హనుమంతుడు.. విగ్రహం పాదాలను తాకి వెళ్తున్న కోతి.. వీడియోలు వైరల్

ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత హరి రామజోగయ్య స్పందించారు. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా జనసేనకు 40-60 స్థానాలను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ కు రెండున్నరేళ్లు సీఎం పదవి ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించాలని అన్నారు. జనసేన మద్దతు లేకుండా టీడీపీకి మెజారిటీ సీట్లు రావని చెప్పారు.

మోడీ ఓబీసీ కాబట్టే శంకరాచార్యులు అయోధ్యకు రాలేదు - ఉదయనిధి స్టాలిన్

ఈ విషయం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే స్పష్టమైందని అన్నారు. వైసీపీని అధికారం నుంచి దింపడం అంటే టీడీపీకి రాజ్యాధికారం కట్టబెట్టడం కాదుగా అని అన్నారు. జగన్ సీఎం పదవి నుంచి దించడం అంటే చంద్రబాబు నాయుడిని సీఎం చేయడమేనా అని ప్రశ్నించారు. దీని కోసం కాపులు పవన్ వెనకాల నడవడం లేదని ఆయన స్పష్టం చేశారు.

టీఎస్ పీఎస్సీలో కీలక మార్పు.. కొత్త సెక్రటరీగా నవీన్ నికోలస్

జనసేనకు 40-60 సీట్లు ఇవ్వడంతో పాటు, రెండున్నరేళ్లు సీఎం పదవి ఇస్తామని ఒప్పదం జరిగితేనే ఓట్ల బదిలీ సరిగా జరుగుతుందని హరి రామజోగయ్య అన్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పొత్తు ధర్మం ప్రకారం సరైన దమాషాలో సీట్ల కేటాయింపు జరగకపోతే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios