Asianet News TeluguAsianet News Telugu

టీఎస్ పీఎస్సీలో కీలక మార్పు.. కొత్త సెక్రటరీగా నవీన్ నికోలస్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కొత్త సెక్రటరీగా నవీన్ నికోలస్ (Naveen Nicolas) నియామకం అయ్యారు. ప్రస్తుత సెక్రటరీ అనితారామచంద్రన్ (Anitha Ramachandran)ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సెక్రటరీగా బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana government) ఉత్తర్వులు జారీ చేసింది.

Major change in TSPSC Naveen Nicholas appointed as new secretary..ISR
Author
First Published Feb 5, 2024, 11:13 AM IST | Last Updated Feb 5, 2024, 11:13 AM IST

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రక్షాళన కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బాధ్యతలు నిర్వహించే ఈ కమిషన్ లో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పు చేసింది. టీఎస్ పీఎస్సీకి కొత్త సెక్రటరీని నియమించింది. కొత్తగా సెక్రటరీగా నవీన్ నికోలస్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుత సెక్రటరీ అనితారామచంద్రన్ ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సెక్రటరీగా ట్రాన్స్ ఫర్ చేశారు.

టీఎస్ నుంచి టీజీగా మార్చడానికి కారణం అదే - మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

టీఎస్ పీఎస్సీతో పాటు పలు శాఖల్లోని అధికారులను కూడా తెలంగాణ ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేసింది. ఐఅండ్ పీఆర్ (సమాచార పౌరసంబంధాలు) శాఖ ప్రత్యేక కమిషనర్ గా ఎం.హనుమంతరావు నియమించింది. అలాగే కె.అశోక్ రెడ్డిని ఉద్యానవన శాఖ డైరెక్టర్ గా బదిలీ చేసింది.

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత..

హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి బి.బాల మాయాదేవిని బీసీ సంక్షేమ కమిషనర్ గా బదిలీ చేసింది. వ్యవసాయశాఖ డైరెక్టర్ బి.గోపిని మత్స్యశాఖ కమిషనర్ గా ఎఫ్ఏసీలో నియమిచింది. టీఎస్ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.నిర్మలాకాంతి వెస్లీని డబ్ల్యూసీడీ, ఎస్సీ డెవలప్ మెంట్ డైరెక్టర్ గా బదిలీ చేశారు. అయితే వాకాటి కరుణను ఆ పదవి నుంచి తప్పించారు. వెస్లీకి ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ పదవి కూడా కొనసాగుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios