Asianet News TeluguAsianet News Telugu

kondapalli municipality : హాజరు కోరగానే.. బల్లలు విరగ్గొట్టారు, అధికారులూ వైసీపీ పక్షమే: కేశినేని ఆగ్రహం

కొండపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్ (kondapalli municipality chairman) ఎన్నిక సందర్భంగా ఈరోజు కూడా వైసిపి (ysrcp) సభ్యులు గందరగోళం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడ (vijayawada mp) టీడీపీ (tdp) ఎంపీ కేశినేని నాని (kesineni nani) . హాజరు తీసుకోమని ఆర్.వో ఆదేశించగానే... బల్లలు విరగ్గొట్టడం ప్రారంభించారని ఆయన ఆరోపించారు. 

vijayawada tdp mp kesineni nani slams ysrcp over kondapalli municipality chairman election
Author
Vijayawada, First Published Nov 23, 2021, 8:46 PM IST

కొండపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్ (kondapalli municipality chairman) ఎన్నిక సందర్భంగా ఈరోజు కూడా వైసిపి (ysrcp) సభ్యులు గందరగోళం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడ (vijayawada mp) టీడీపీ (tdp) ఎంపీ కేశినేని నాని (kesineni nani) . హాజరు తీసుకోమని ఆర్.వో ఆదేశించగానే... బల్లలు విరగ్గొట్టడం ప్రారంభించారని ఆయన ఆరోపించారు. కోర్టు ఆదేశాలతో జరిగే ఎన్నిక అయినా... అధికారులు వైసిపి‌కి అనుకూలంగా వ్యవహరించారని నాని వ్యాఖ్యానించారు. 

వైసిపి సభ్యులు ఈ రెండు రోజులు అరాచకం, హడావుడి చేశారని.. ఎన్నికల అధికారి సరైన వివరణ ఇవ్వకుండా ఎన్నిక వాయిదా వేశారని కేశినేని ఆరోపించారు. దీనిపై హైకోర్టు కూడా ఈరోజు అధికారుల తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేసిందని ఆయన గుర్తుచేశారు. రేపు పదిన్నరకు ఎన్నికలు పెట్టాలని హైకోర్టు (ap high court) ఆదేశించిందని.. టీడీపీ సభ్యులను పూర్తి పోలీసులు భద్రతతో తీసుకురావాలని సూచించిందని కేశినేని నాని అన్నారు. రేపు అయినా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతతో ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తున్నామని ఆయన ఆకాంక్షించారు. వైసిపి సభ్యుల తీరుపై ఎన్నికల అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయాలని కేశినేని డిమాండ్ చేశారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా మా సభ్యులు ధైర్యం గా నిలబడ్డారని.. క్యాష్ కన్నా క్యారెక్టర్ ముఖ్యమని నిలబడిన టీడీపీ సభ్యులకు ఎంపీ కేశినేని ధన్యవాదాలు తెలిపారు. 

ALso Read:కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక రేపే:ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కాగా.. కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నికను బుధవారం నాడు నిర్వహించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నివేదికను తమకు అందించాలని కోరింది.కొండపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై tdp దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ap high court  మంగళవారం నాడు విచారణ నిర్వహించింది.  మధ్యాహ్నం నాడుkondapalli municipality  కమిషనర్, Vijayawada సీపీలను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని విజయవాడ ఇంచార్జీ సీపీకి  ap high court ఆదేశించింది.

రెండు రోజులుగా కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక వాయిదా పడింది.  నిన్న, ఇవాళ కూడా  మున్సిపల్ ఛైర్మెన్  ఎన్నిక ప్రక్రియ నిర్వహించలేదు. వైసీపీకి చెందిన కౌన్సిలర్ల నుండి  తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.  విజయవాడ ఎంపీ కేశినేని నానికి ఎక్స్ అఫిషియో ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం లేదని వైసీపీ తీవ్ర అభ్యంతరం చెబుతుంది. ఇదే విషయమై నిన్న, ఇవాళ కూడా వైసీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆందోళనలకు దిగారు. 

Follow Us:
Download App:
  • android
  • ios