Asianet News TeluguAsianet News Telugu

Kondapalli municipality: కొండపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ ఎన్నిక వాయిదాపై ఏపీ హైకోర్టు ఆగ్రహం..

కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్  చైర్‌పర్సన్‌ ఎన్నిక (Kondapalli municipal chairman) వాయిదా పడటంపై ఏపీ హైకోర్టు (AP High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిక ఎందుకు నిర్వహించలేకపోయారని సంబంధిత అధికారులను ప్రశ్నించింది. విజయవాడ సీపీ (Vijayawada CP) , కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ నేడు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. 

AP High court serious on Kondapalli municipal chairman election postponement
Author
Amaravati, First Published Nov 23, 2021, 3:03 PM IST

కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్  చైర్‌పర్సన్‌ ఎన్నిక (Kondapalli municipal chairman) వాయిదా పడటంపై ఏపీ హైకోర్టు (AP High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిపించాలని కోరుతూ టీడీపీ హైకోర్టులో లంచ్ మోషన్‌ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ అనుమతించిన హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అశ్వినీ కుమార్ వాదనలు వినిపిస్తూ.. నిన్న, ఈ రోజు వైసీపీ నేతలు కావాలనే విధ్వంసం సృష్టించిన ఎన్నికను వాయిదా వేసేలా చేశారని కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశించిన ఎన్నిక జరగలదేని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే స్పందించిన హైకోర్టు.. ఎన్నిక ఎందుకు నిర్వహించలేకపోయారని సంబంధిత అధికారులను ప్రశ్నించింది. విజయవాడ సీపీ (Vijayawada CP), కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ నేడు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. 

YCP నేతలు ఆందోళన నేపథ్యంలో.. కొండపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది. వాస్తవానికి సోమవారం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకోవడంతో.. చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక నేటికి వాయిదా పడింది. నేడు కూడా అలాంటి పరిస్థితులు ఉండటంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. అయితే టీడీపీ కౌన్సిలర్లు, ఎంపీ కేశినేని నాని మాత్రం కార్యాలయంలోనే కూర్చొన్నారు. ఒకవేళ హైకోర్టు తీర్పు వస్తే ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుందని వారు అంటున్నారు. మరోవైపు వైసీపీ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. రిటర్నింగ్ అధికారి సునీల్ కుమార్ రెడ్డి కూడా అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. 

Also read: Kondapalli municipality: కొండపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలో ఉద్రిక్తత.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

ఇక, ఇటీవల కొండపల్లి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం 29 వార్డులకు గానూ.. టీడీపీ, వైసీపీలు చెరో 14 వార్డుల్లో విజయం సాధించాయి. టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించిన శ్రీలక్ష్మి.. ఆ తర్వాత టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఇక, ఇరు పార్టీలకు చెరో ఎక్స్ అఫీషియో సభ్యులు ఉండటంతో.. మొత్తం టీడీపీకి 16 ఓట్లు, వైసీపీకి 15 ఓట్లు ఉన్నాయి. టీడీపీ తరఫున విజయవాడ ఎంపీ కేశినేని నాని  (kesineni nani), వైసీపీ తరఫున ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ (vasantha krishna prasad) ఎక్స్ అఫీషియో ఓటును (ex officio vote) వినియోగించుకోవాల్సి ఉంది. అయితే ఉద్రిక్తత నేపథ్యంలో ఎన్నిక నిర్వహించలేకపోతున్నట్టుగా రిటర్నింగ్ అధికారి చెబుతున్నారు.

అయితే కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగకుండా వైసీపీ అడ్డుకుంటుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విధ్వంసాలకు పాల్పడుతూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ చేస్తున్న పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారని మండిపడ్డారు. 

కేశినాని ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎలా అవుతారని అంటున్న వైసీపీ
కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా తనకు ఓటు హక్కు కల్పించాలని టీడీపీ ఎంపీ కేశినేని వారం రోజుల క్రితమే మున్సిపల్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందన రాకపోవడంతో ఆయన హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఎక్స్‌అఫీషియో సభ్యునిగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎంపీ కేశినేని నానికి హైకోర్టు అనుమతించింది. ఈ విషయంలో ఎంపీకి అనుమతి ఇవ్వాలని కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌, సహాయ ఎన్నికల అథారిటీని ఆదేశించింది. అయితే వైసీపీ మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. . విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నారని.. అక్కడ ఓటు హక్కు ఉన్న వ్యక్తికి కొండపల్లిలో ఎలా ఇస్తారని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios