కరెన్సీ కష్టాలను కొంత వరకూ తగ్గించేందుకు ఆర్బిఐ రాష్ట్రానికి రూ.2420 కోట్లను పంపింది.
కరెన్సీ కష్టాలను కొంత వరకూ తగ్గించేందుకు ఆర్బిఐ రాష్ట్రానికి రూ.2420 కోట్లను పంపింది. ఈ మొత్తాన్ని ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ నుండి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ప్రాంతాలకు తరలించారు. విశాఖపట్నం కేంద్రంగా మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలు, తిరుపతి కేంద్రంగా రాయలసీమలోని నాలుగు జిల్లాలు, విజయవాడ కేంద్రంగా కోస్తా, ఉభయ గోదావరి జిల్లాలకు నగదు పంపిణీ జరిగింది.
తిరుపతికి రూ. 365 కోట్ల విలువైన కొత్త నోట్లు అందాయి. మొత్తం డబ్బు ఆంధ్రాబ్యాంకు శాఖలకు చేరాయి. అక్కడి నుండి వివిధ బ్యాంకులు, శాఖలకు అందుతాయి. అదేవిధంగా, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల విస్తీర్ణాన్ని బట్టి నగదును ఆర్బిఐ పంపింది. శుక్రవారం అర్ధరాత్రి కల్లా వచ్చిన నగదును బ్యాంకు శాఖలకు, ఏటిఎంల్లో సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే, అవసరాల మేరకు ఆర్బిఐ నగదును పంపటం లేదన్న ఆరోపణలైతే విస్తృతంగా వినబడుతున్నాయి.
