అధికారాన్ని ఉపయోగించుకొని వైసీపీ కీలక నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడుతున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపించారు. విశాఖలోని మధురవాడలో రూ.100తో నిర్మిస్తున్న విల్లా ఆయన కూతురుదే అని మూర్తియాదవ్ అన్నారు.
వైసీపీ ముఖ్య నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి అధికారాన్ని ఉపయోగించుకొని ఆయన కుటుంబ సభ్యులు విశాఖపట్నంలో భారీగా లబ్ది పొందారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జీవీఎంసీ అధికారులు విజయసాయిరెడ్డి ఆక్రమాలకు సహకరిస్తున్నారని అన్నారు. ఆయన కూతురు నేహారెడ్డి పార్టనర్ గా ఉన్న అవ్యాన్ రియల్టర్స్ ఎల్‌ఎల్‌పీ కంపెనీ పేరుతో దాదాపు రూ.100 కోట్లతో విశాఖలోని మధురవాడలో విల్లా నిర్మిస్తున్నారని ఆరోపించారు. అది ఇంకా పూర్తికాక ముందే దానికి హౌస్ ట్యాక్స్ తయారు చేశారని అన్నారు.
వివాహేతర సంబంధాల వల్ల కలిగిన పిల్లలకూ.. ఆస్తిలో వాటా - సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబీకులు, బినామీ కంపెనీల పేర్లను వాడుకొని ఉత్తరాంధ్రలో కోట్ల ఆక్రమాలకు పాల్పడ్దారని పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. వివాదాస్పద దసపల్లా భూములను కొట్టేశారని, అనకాపల్లి విస్సన్నపేట లేఅవుట్‌లో 60 ఎకరాలు గిఫ్ట్ గా పొందారని ఆయన చెప్పారు. అలాగే మధురవాడలో రూ. 100 కోట్లతో కడుతున్న విల్లాను తమ చేతుల్లోకి తీసుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు.
సోషల్ మీడియాలో టీచర్ తో స్నేహం.. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందని కత్తితో దాడి.. కూకట్ పల్లిలో ఘటన
2008 సంవత్సరంలో మధురవాడలో రెండు సర్వే నెంబర్లలో 80 ఎకరాల్లో వుడా, గ్లోబల్ ఎంట్రోపొలిస్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి ఓ జాయింట్ వెంచర్ ప్రాజెక్టు చేపట్టాలని సంకల్పించిందని మూర్తియాదవ్ అన్నారు. కొంత కాలం తరువాత ఆ సంస్థ మొత్తం స్థలాన్ని కొనుగోలు చేసిందని అన్నారు. అందులోని కొంత స్థలంలో పనోరమ హిల్స్ శ్రీరామ్ ప్రాపర్టీస్ అనే పేరుతో ఇంటి నిర్మాణాలు మొదలు పెట్టిందని చెప్పారు. మిగిలిన వాటిలోనూ కట్టాలని భావిస్తున్న టైమ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిందని తెలిపారు. దాని కోసం అనుమతులు అవసరం ఉంటే.. విజయ సాయి రెడ్డికి డబ్బులు కట్టాల్సి వచ్చిందని ఆరోపించారు.
విద్యార్థులతో మూత్రశాలలు కడిగించిన ప్రధానోపాధ్యాయురాలు.. కృష్ణా జిల్లా గుడివాడలో ఘటన
అందుకే ఆ ప్రాజెక్టులోని 126 స్థలంలో ఉన్న విల్లాను అవ్యాన్ అనే సంస్థకు రిజిస్ట్రేషన్ చేశారని జనసేన కార్పొరేటర్ ఆరోపించారు. ఈ రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాతే అనుమతులు లభించాయని ఆయన అన్నారు. ప్రాజెక్టులో మిగిలిన స్థలాన్ని గ్లోబల్ ఎంట్రోపొలిస్ సంస్థ మినిస్టర్ కొట్టు సత్యనారాయణ సోదరుడు మురళీకృష్ణ చేయిస్తున్న ఐకానికా ప్రాజెక్టుకు అప్పగిచ్చిందని తెలిపారు. దానిని పూర్తి చేసే క్రమంలో ఎంపీ విజయ సాయి రెడ్డి కూతురు విల్లాను వంద కోట్లతో నిర్మాణం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
